
వైఎస్ షర్మిల కూడా తన అన్న జగన్మోహన్ రెడ్డిలాగే తెలంగాణలో తనను నమ్ముకొన్న పార్టీ నాయకులకి, కార్యకర్తలకు హ్యాండ్ ఇచ్చేయాలని ప్రయత్నించడంతో వారే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించేశారు. కనుక ఆమెకు ఇప్పుడు సొంత పార్టీ కూడా లేదు.
వ్రతం చెడ్డా ఫలం దక్కన్నట్లు ఆమె తెలంగాణ కాంగ్రెస్లో చేరాలనుకొంటే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెను చేరనీయకుండా అడ్డుకొన్నారు. దాంతో ఆయనపై ఆమె చాలా గుర్రుగా ఉంది.
ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవికి అర్హులైన కొందరు సీనియర్లు ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ సిఎం పదవి చేపట్టేందుకు అర్హులే. కనుక వారిలో ఎవరో ఒకరికి సిఎం పదవి ఇస్తే బాగుటుంది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేవారికి (రేవంత్ రెడ్డి)కి ఇవ్వకూడదు,” అని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె ‘తెలంగాణ ప్రజలు బైబై కేసీఆర్’ అని చెపుతున్నారు అంటూ వ్రాయించిన ఓ సూట్ కేసుని మీడియాకు చూపించి, దీనిని కేసీఆర్కు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను,” అని వైఎస్ షర్మిల చెప్పారు. అయితే కేసీఆర్ కంటే ముందే తన సొంత పార్టీ నేతలే ‘బైబై షర్మిల’ అని చెప్పేసి వెళ్ళిపోయారనే విషయం మరిచిపోయిన్నట్లున్నారు.
తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న రాష్ట్రంలో ఆమె రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ తిరిగారు. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్లో చేర్చుకొంటే, కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బ తీస్తారని రేవంత్ రెడ్డి ఊహించారు. అందుకే ఆమెను పార్టీలో చేరకుండా అడ్డుకొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ, ఎన్నికల సమయంలో ఆమెను పార్టీకి చాలా దూరంగా ఉంచారు. బహుశః ఈవిషయం ఆమెకు కాంగ్రెస్ పెద్దలు తెలియజేసే ఉంటారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావిస్తున్నారు. అటువంటప్పుడు ఆమె రేవంత్ రెడ్డి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ “రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదు,” అంటూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. ఈ నోటి దురదతో తెలంగాణ కాంగ్రెస్లో ఎన్నటికీ చేరే అవకాశం లేకుండా చేసుకొన్నారని చెప్పక తప్పదు. కనుక ఆమె రాజకీయ భవిష్యత్ ఏవిదంగా ఉంటుందో? అయినా ఆమె కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు, ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో ఆమె ఎలా చెపుతారు?
The plot to commit a mass shooting at a Hindu temple in Aurora has been…
The reported differences between Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan…