
తెలంగాణ రాష్ట్రంలో తనకు గుర్తింపు లభించడం లేదు కనుక ఏదోవిదంగా అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశ్యంతో ఆమె తనంతట తానుగా ఢిల్లీ వెళ్ళారా లేక బిజెపి చెపితే వెళ్ళి ఫిర్యాదు చేశారో తెలీదు కానీ ఒకవేళ సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తే అప్పుడు సిఎం కేసీఆర్ కూడా ధీటుగానే స్పందిస్తారని వేరే చెప్పక్కరలేదు.
అప్పుడు ఆమెను మాత్రమే కాకుండా ఏపీలో వైసీపీని కూడా టార్గెట్ చేయకుండా విడిచిపెట్టరు. ఇప్పటికే ఏపీలో అడుగుపెట్టేందుకు బిఆర్ఎస్‌తో మార్గం ఏర్పరచుకొన్నారు కనుక ఎప్పుడో రావాలనుకొన్న ఆయన ఇప్పుడే ఏపీలోకి వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దాడి ప్రారంభిస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది.
బహుశః ఈవిదంగా జరగాలనే వైఎస్ షర్మిల కేసీఆర్‌ను రెచ్చగొట్టేందుకు ఢిల్లీ వెళ్ళి ఆయనపై సీబీఐకి ఫిర్యాదు చేశారా?అనే సందేహం కూడా కలుగుతోంది. సీబీఐ దర్యాప్తు ప్రారంభించినా ప్రారంభించకపోయినా తాను మాత్రం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైఎస్ షర్మిల బల్లగుద్ది మరీ చెపుతున్నారు. కనుక అక్కడ ఆమె చేస్తున్న ఈ హడావుడి ఏదో ఓ రోజు ఏపీలో జగనన్న పీకకు చుట్టుకోకుండా ఉండదు.
నిజానికి ఆమె కూడా తమ కుటుంబానికి మంచి పట్టున్న ఏపీలోనే రాజకీయాలు చేయాలని కోరుకొన్నప్పటికీ, జగనన్నను విమర్శిస్తూ రాజకీయాలు చేయడం చాలా కష్టమని భావించే తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొన్నారు. ఒకవేళ జగనన్న దిగిపోతే ఆమె ఏపీలో ప్రవేశించడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఆ రోజు కోసమే ఆమె ఎదురుచూస్తున్నారా? అందుకే తెలంగాణలో నిప్పు రాజేస్తున్నారా? ఏమో రాజకీయాలలో ఏమైనా జరుగవచ్చు.
Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…