
ఏపీ కాంగ్రెస్‌లో చేరితే మొట్టమొదట తన సొంత అన్ననే విమర్శిస్తూ అతనితోనే యుద్ధం చేయవలసి ఉంటుంది. అన్నపై కత్తులు దూసి యుద్ధం ప్రారంభిస్తే దాని పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయో, చివరికి ఎవరు నష్టపోతారో కూడా ఊహించడం కష్టమే. అదే… తెలంగాణ కాంగ్రెస్‌లో చేరితే ఓ నాలుగైదు టికెట్స్ సంపాదించుకొని, కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేసేయొచ్చు.
కానీ ఆమె చేరికను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే వ్యతిరేకిస్తున్నారు. ఆమెను పార్టీలో చేర్చుకొంటే, కాంగ్రెస్ ముసుగులో ఆంద్రావాళ్ళు మళ్ళీ తెలంగాణ దోచుకోవడానికి వస్తున్నారంటూ బిఆర్ఎస్ చేయబోయే విమర్శల వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగవచ్చు. అదీగాక తాను వైఎస్ రాజశేఖర్ బిడ్డనని, ముఖ్యమంత్రి పదవి చేపడతానంటూ చెప్పుకొంటూ తిరిగారు కనుక రేపు ఆమె కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినా ఆశ్చర్యం లేదు. కనుక తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమెకు అవకాశం లేన్నట్లే. అలాగని ఆమె ఏపీ కాంగ్రెస్‌లోకి కూడా వెళ్ళలేరు. కనుక ఆమె పరిస్థితి అయోమయంగా మారింది.
మరో సమస్య ఏమిటంటే, ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేయబోతున్నారని, ఏపీ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతారంటూ వార్తలు గుప్పుమనడంతో ఇన్నాళ్ళుగా ఆమె పడిన శ్రమ అంతా బూడిదపాలైంది. ఈ కారణంగా ఇప్పుడు తెలంగాణలో ప్రజలు కూడా ఆమె మాటలను నమ్మే పరిస్థితి లేదు. ఆమె కూడా తన అన్నలాగే తమకు హ్యాండిచ్చి ఏపీకి వెళ్ళిపోతారనే భావన పార్టీ నేతల్లో కూడా కలగడంతో ఉన్న కొద్దిమంది కూడా వేరే దారి చూసుకొంటున్నారు. దీంతో వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది.
అదే… కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఇటువంటి ఆలోచనలు కల్పించకుండా ఉండి ఉంటే, ఆమె మానాన్న ఆమె తన పార్టీని నడిపించుకొనేవారు. ఎలాగూ తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడ్డాయి కనుక తన అదృష్టాన్ని ఓసారి పరీక్షించి చూసుకొనేవారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆమె దారులన్నీ మూసేసి, ఏపీ వైపు తలుపు ఒక్కటీ తెరిచి ఉంచింది. మరోదారి లేదు కనుక ఆమె ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తారా? వచ్చి అన్నతో యుద్ధం చేస్తారా?అనే ప్రశ్నలకు సమాధానాలు మరికొన్ని రోజులలో తెలుస్తుంది.
Revanth Reddy has been maintaining an active person on social media for a long time…
Prabhas and Sandeep Reddy Vanga’s Spirit has been grabbing attention with its casting updates and…