
రాష్ట్రంలో ఉన్న ఆడవారందరిని తన అక్కచెల్లమ్మలుగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వైస్ జగన్ తన సొంత చెల్లల్ల మీద జరుగుతున్న అకృత్యాలను ఆపలేకపోతున్నారా..? అంటూ వైస్ వివేకా కూతురు వైస్ సునీతా రెడ్డి జగన్ ప్రశ్నిస్తున్నారు.
తనకు ప్రాణహాని ఉందంటూ హైద్రాబాద్ పోలీసులను ఆశ్రయించారు సునీతా. తనను, తన సోదరి వైస్ షర్మిలను జగన్ మద్దతుదారులు సోషల్ మీడియాలో నీచంగా ట్రోల్ చేస్తున్నారని, అలాగే చంపేస్తాం అంటూ బెదిరింపు పోస్టులు పెడుతున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
శత్రుశేషం లేకుండా చేస్తాం…లేపేస్తాం…అంటూ ఫేస్ బుక్ లో పోస్టులుపెడుతున్నారంటూ వాపోయిన సునీతా, వైస్ కుటుంబంలో ఆడవారికే ఈ రాష్ట్రంలో భద్రత లేకపోతే ఇక మాములు ప్రజల సంగతి ఏంటంటూ ప్రశ్నించారు.
ఈ పోస్టులన్నీ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉండే వ్యక్తే చేస్తున్నారని, పులివెందుల కార్యక్రమాలన్నీ చక్కబెట్టే ఆ వ్యక్తి చేసే ఇటువంటి దిగజారుడు పనులకు ఆ పులివెందుల ఎమ్మెల్యే కు బాధ్యత లేదా..?అంటు ప్రశ్నించారు.
తన తండ్రి మరణానికి న్యాయం కావాలి అంటూ గత ఎన్నికల నుండి న్యాయపోరాటం చేస్తున్న తన పై ‘కాలకేయ సైన్యం’ లా సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు సునీతా. సూత్రధారి: చంద్రబాబు, పాత్ర దారులు: షర్మిల, సునీతా,బి టెక్ రవి, సీఎం రమేష్ అంటూ సాక్షి కథనాలు చూస్తుంటే రాజకీయ పదవుల కోసం కుటుంబ బంధాలను ఇలా బజారుకి ఈడుస్తారా అనిపించింది.
ఇక వీటి పై ఉపేక్షించేది లేదని, తనకు జగన్ మాదిరి సలహాదారులు అవసరం లేదని, తన పై తనకు నమ్మకం ఉందన్నారు. అయితే గత ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇదే షర్మిల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ పోలీసులను ఆశ్రయించిన జగన్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ను అడ్డుపెట్టుకుని సొంత కుటుంబంలోని ఆడవారి పై మానసిక దాడి చేపించడం ఎంతవరకు న్యాయం.
ఇదేనా ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రంలో ఆడవారి పట్ల ప్రవర్తించే తీరు.?తనకు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పిన వారికీ ఇదే గతి పడుతుందని వైసీపీ సోషల్ మీడియా తమ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతుందా..? సొంత బాబాయ్ కూతురుని శత్రు శేషం లేకుండా చేస్తాం అంటే వివేకా వైస్ జగన్ కు శత్రువా..? ఇలా ఎన్నో ప్రశ్నలు సునీతా జగన్ ముందు వైసీపీ ప్రభుత్వం ముందు ఉంచింది.
“ప్రశ్నిస్తే పరువు తీస్తాం” అన్నట్టుగానే వైసీపీ నేతలు, అధిష్టానం వైఖరి ఉంటుంది. పవన్ రాజకీయ విధానపరమైన ప్రశ్నలు అడిగితే మూడు పెళ్లిళ్లు, ముగ్గురు పెళ్ళాలు, బాబు, లోకేష్ పై విమర్శలు చేయాలన్న భువనేశ్వరిని, బ్రాహ్మణిని సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం, అలాగే షర్మిల ప్రత్యేక హోదా ఏది అంటే నువ్వు వైస్ కాదు మురుసుపల్లి శాస్త్రి అంటూ ముందుకెళ్లడం, సునీతా తన తండ్రి కి న్యాయం చేయండి అంటే శత్రు శేషం లేకుండా చేస్తాం అంటూ బెదిరించడం చూస్తే సునీతా రెడ్డి అన్నట్లే జగన్ మద్దతుదారులు ‘కాలకేయ సైన్యం’ లా ప్రవర్తిస్తున్నారని స్పష్టమవుతుంది.
ఈ కాలకేయ సైన్యాన్ని కట్టడి చేయడానికి ఏ బాహుబలి వస్తారో చూడాలి..!
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…
Sundeep Kishan usually keeps things low-key while promoting his films and rarely makes big claims…