
సీబీఐ అధికారులనే బెదిరించి వారిపై కేసులు వేయించగల సమర్ధులు వారు. ఈ కేసు విచారణ హైదరాబాద్కు బదిలీ అయినప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా విచారణ చేయగలుగుతున్నాయి. కనుక త్వరలోనే నా తండ్రి హంతకులు, వారికి సాయపడినవారందరూ శిక్షింపబడుతారని నేను నమ్ముతున్నాను. నా తండ్రి హత్యకు సంబందించి నాకు తెలిసిన అన్ని విషయాలు సీబీఐకు చెపుతాను. నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే నా ఏకైక లక్ష్యం,” అని అన్నారు.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా సీబీఐ పేర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని మంగళవారం సీబీఐ నాలుగు గంటలసేపు ప్రశ్నించింది. ఆయనని అరెస్ట్ చేయాలని సీబీఐ భావిస్తున్నప్పటికీ తెలంగాణ హైకోర్టు ఆదేశాల కారణంగా అరెస్ట్ చేయలేకపోతోంది. హైకోర్టు తీర్పు వెలువడితే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమే అని భావించవచ్చు.
Vijay Deverakonda is back on the big screen with Ranabaali. The film is based on…
Aakasamlo Oka Tara, presented by Geetha Arts and Swapna Cinema, explores the story of Kalpana,…