
ఆమె టిడిపిలో చేరబోతున్నట్లు కడపలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. “రాజకీయ రంగప్రవేశం చేయనున్న డా.వైఎస్ సునీతమ్మగారికి స్వాగతం… సుస్వాగతం” అంటూ టిడిపి పోస్టర్లు వెలిశాయి. వాటిలో పైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తదితర టిడిపి నేతలు ఫోటోలు, కిందన వైఎస్ వివేకానందరెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఫోటోలు మద్యలో సునీతా రెడ్డి ఫోటో ముద్రించారు.
ఓ విదంగా ఇది మైండ్ గేమ్ లేదా ఆమె వ్యక్తిత్వ హననమే అని చెప్పవచ్చు. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన వైసీపీ నేతలే ఇప్పుడు ఆయన ఆత్మ క్షోభించేలా అనేక ఆరోపణలు చేస్తుండటం, ఇప్పుడు ఆయన కుమార్తెను కూడా ఈవిదంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుండటం చాలా బాధాకరమే.
ఈ పోస్టర్లపై టిడిపి వెంటనే స్పందిస్తూ, వాటికీ తమ పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని, సునీతారెడ్డిని టిడిపిలో చేర్చుకోవడం లేదని ప్రకటించింది.
ఇదివరకు ఓసారి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ, “వారిద్దరూ ఎవరు?ఒకరు స్వయాన్న నాకు చిన్నాన్న (వివేకా). మరొకరు మరో చిన్నన్న కొడుకు (అవినాష్ రెడ్డి). ఇద్దరూ నాకు రెండు కళ్ళలాంటివారు. కనుక ఎక్కడైనా ఒక కన్ను మరో కన్నును పొడుచుకొంటుందా? ఒక వేలుతో ఓ కన్నును పొడుచుకొంటామా?” అని ప్రశ్నించారు.
కానీ ఆ తర్వాత అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం వివేకా, ఆయన కూతురు, అల్లుడి పరువుప్రతిష్టలను, వ్యక్తిత్వాలను దెబ్బ తీసేందుకు వైసీపీ ఇటువంటి ప్రయత్నాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. అయితే సొంత మీడియాలో లేదా సోషల్ మీడియాలోనో వైసీపీ ఇచ్చుకొనే తీర్పులతోనో లేదా కడప గోడల మీద చేసుకొనే ఇటువంటి దుష్ప్రచారాలతోనో సీబీఐ విచారణ ఆగిపోదు… హైకోర్టులో తీర్పులు మారిపోవు కదా?
ఇటీవల జనసేన పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు అందరూ ఊహించినట్లే ఆ పార్టీ మేయర్ అభ్యర్ధిగా అవకాశం దక్కించుకున్నారు. వంగవీటి…
Naga Vamsi has confirmed a film with director Nelson Dilipkumar and music composer Anirudh Ravichander…