
వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేయలని కోరుతూ పిటిషన్ వేయగా సోమవారం దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు తీరును తప్పు పడుతూ ముందస్తు బెయిల్ విచారణపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కనుక తెలంగాణ హైకోర్టు తక్షణం అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తుందని భావిస్తే, దానిపై నేడు విచారణ జరపాలని నిర్ణయించింది. కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి ఇంకా అందకపోవడంతో ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం దానిపై విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
హైకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుండటంతో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి మంగళవారమే హైకోర్టు దీనిపై విచారణ జరిపి తీర్పు చెప్పి ఉండేది. కానీ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఆశ్రయించడంతో ఊహించనివిదంగా అవినాష్ రెడ్డికి ఉపశమనం లభిస్తోంది. వివేకాను సునీతారెడ్డి దంపతులే హత్య చేశారని ఆరోపిస్తున్నఅవినాష్ రెడ్డికి సునీతా రెడ్డే ఈవిదంగా పరోక్షంగా ఉపశమనం కలిగించడం విచిత్రమే కదా?
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…