
వివేకా హత్య కేసుని తెలంగాణకి బదిలీ చేసినందున ఈ కేసుని తెలంగాణ హైకోర్టుకే బదిలీ చేస్తున్నామని, ఈ కేసుని మరింత లోతుగా విచారణ జరిపి గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలో వద్దో హైకోర్టు నిర్ణయించాలని సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొంది. దీంతో ఓ వీఐపీ హత్య కేసులో ప్రధాన నిందితుడు బెయిల్పై స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నాడు.
వివేకా హత్య కేసుని సీబీఐకి బదిలీ చేసినప్పటికీ ఏపీలో వారు దర్యాప్తు చేయగల పరిస్థితులు లేనందున ఈ కేసుని తెలంగాణకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణని తెలంగాణకి బదిలీ చేసింది. అయినా గంగిరెడ్డిని ఇంతవరకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేయలేకపోయారు. చివరికి వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించినా అక్కడా గంగిరెడ్డి బెయిల్ రద్దు కాలేదు. ఈ కేసు తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేయడంతో మళ్ళీ దాని కోసం పోరాటం చేయకతప్పడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడినే అరెస్ట్ చేయలేనప్పుడు ఇక ఈ కేసు ఎప్పటికీ పరిష్కారం అవుతుందనే సందేహాలు వ్యక్తం అవుతుండటం సహజమే కదా?
The promotional materials for Nitesh Tiwari’s Ramayana are back in the headlines again. While the…
Music composer Anirudh and Sunrisers Hyderabad CEO Kavya Maran are making headlines after their wedding…