
నిజంగా ఈ కేసులో అవినాష్ రెడ్డి ఉంటే, ఆ హత్య మీరు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కదా? అప్పుడు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారంటూ తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లోకి నెట్టే విధంగా వైసీపీ వర్గాలు విరుచుకు పడుతున్నాయి. అయితే దీనికి జవాబు అదే పార్టీ ఎంపీ అయిన రఘురామ కృష్ణంరాజు నుండి వచ్చింది.
నిజమే… వివేకా హత్య జరిగినపుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ నాడు కేవలం ఓ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది గనుక, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఉండదు. అది కాక నాడు వైసీపీ సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేసారు.
సీబీఐ విచారణ ఎందుకు డిమాండ్ చేసారంటే, సీబీఐ విచారణ అయితే సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటుంది, ఎలాగూ తన అక్రమాస్తుల కేసులలో జగన్ కు పూర్తిగా తెలిసింది, మామూలుగా అయితే విచారణ వేగంగా జరుగుతుంది, అదే సీబీఐ అయితే ఏళ్ళ తరబడి సాగించవచ్చని సీబీఐ విచారణ డిమాండ్ చేసారు.
అలాగే చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఈ కేసుపై కోర్టు నుండి ‘గ్యాగ్’ ఆర్డర్ ను ఎందుకు జగన్ తీసుకువచ్చారు? ఏ మీడియా కూడా ఈ కేసు గురించి రాయకుండా, ‘గ్యాగ్’ ఆర్డర్ ను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నిజంగా జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ గ్యాగ్ ఆర్డర్ ను తీసుకువచ్చి విచారణను ఎందుకు ఆలస్యం చేసారు?
ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కావాలని, అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారు? అది పక్కన పెట్టినా, ఈ కేసు విచారణ చేసిన మహంతి వెల్లడించిన విషయాలనే నేడు సీబీఐ కూడా చెప్తోంది. మరి నాడు మహంతిని ఎందుకు బదిలీ చేసారు?
చివరికి వైఎస్ వివేకా కూతురు సునీత కోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ కావాలని అడిగితే, ప్రస్తుతం ఆ విచారణ జరుగుతోంది. అవినాష్ రెడ్డి విషయంలో ఒక కన్ను ఇంకొక కన్నును పొడుచుకుంటుందా? అని వ్యాఖ్యానించిన జగన్, మరి వైఎస్ వివేకాను సొంత కూతురు మరియు అల్లుడే కడతేర్చారు అనే విధంగా ప్రచారం చేయించారు, అది ఒక కన్నును మరో కన్ను పొడుచుకోవడం కాదా? అంటూ ఆర్ఆర్ఆర్ వైసీపీ వర్గాలను ప్రశ్నించారు.
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…
Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…