
2019 ఎన్నికలలకు ముందు వరకు ఏపీ రాజధాని అమరావతే అంటూ ముక్తకంఠంతో ఆమోద ముద్ర వేసిన వైసీపీ, ఆ తరువాత ఎన్నికల గెలుపుతో మూడు రాజధానులు అంటూ మాట మార్చింది, విశాఖే రాజధాని అంటూ మడం తిప్పింది.
అయితే ఆ విధ్వంసం తాలూకా ఫలితాన్ని నేడు వైసీపీ అనుభవిస్తున్నప్పటికీ, వైసీపీ తీరులో ఏమైనా మార్పు వచ్చిందా అంటూ బూతద్దం పెట్టిన వెతికినా లేదు అనే సమాధానమే వినిపిస్తుంది. అయితే నాడు అమరావతి ని స్మశానం అంటూ నిందలు వేసిన వైసీపీ నాయకులు ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ని సమాధి చేసారు.
అలాగే అటు విశాఖే రాజధాని అంటూ జబ్బలు చరుచుకున్నప్పటికీ అక్కడ కూడా వైసీపీ రెక్కలు విరిచారు విశాఖ వాసులు. అయితే గతంలో మాదిరి రేపు భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలలో వైసీపీ మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లగలుగుతుందా.? లేక అమరావతే ఏకైక రాజధాని అంటూ ప్రజలను ఒప్పించగలుగుతుందా.?
అయితే ఈసారి రాజధాని పై వైసీపీ చెప్పే మాయ మాటలను, తప్పుడు హామీలను ప్రజలు విశ్వసించగలరా.? వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి జగన్ ఏ స్థాయి రాజకీయాలకు తెరలేపుతారో చూడాలి. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం రానున్న మూడేళ్ళలో అమరావతికి ఒక స్పష్టమైన రూపం ఇచ్చి రాజధాని అనే పదానికి సరైన న్యాయం చెయ్యాలని భావిస్తుంది.
అలాగే అటు వైసీపీ ని కాదని తమకి పట్టం కట్టిన విశాఖ నగరాన్ని కూడా ఐటీ హబ్ గా మార్చి పారిశ్రామికంగా విశాఖను కేంద్ర భిందువుగా చేయడానికి అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ తరుణంలో వైసీపీ గతం మూడు రాజధానులు ఇక మట్టిలో కలిసినట్టుగానే భావించాలి, మరి వైసీపీ భవిష్యత్ ఏంటన్నది ఇప్పటికి ప్రశ్నార్ధకమే.
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…