
అవకాశం చిక్కినప్పుడల్లా ఎదో ఒక కారణంతో అధికార పక్షాన్ని విమర్శించాలని, ఆ పార్టీలను ఇరుకునపెట్టాలని విపక్షాలు రాజకీయాలు చేయడం సర్వ సహజం. అయితే సాంప్రదాయ రాజకీయాలను కాకుండా విధ్వంశకర రాజకీయాలను ప్రోత్సహించే వైసీపీ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు ముందుకేస్తుంది.
వైసీపీ రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టుగా శుభకార్యం నుంచి అశుభం వరకు దేనినైనా అయితే తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రత్యర్థుల మీద బురద జల్లే రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేయడం, లేకుంటే పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన ల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు తెరలేపుతూ పైశాచిక ఆనందాన్ని పొందడం వైసీపీ దినచర్యలో భాగమయిపోయింది.
అసలు విషయానికి వస్తే, మే 2 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోయే రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి గాను ప్రభుత్వం తరుపున ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయి. అలాగే ఇటు రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతు కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మరి ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ప్రభుత్వం తరుపున ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు కూటమి పార్టీల నేతలు.
అయితే ఇప్పుడు ఈ ఆహ్వాన పత్రికతోనే టీడీపీ, జనసేన మధ్య రాజకీయ చిచ్చు రేపడానికి వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది. ప్రభుత్వం తరుపున జరుగుతున్న ఈ కార్యక్రమానికి గాను ఆహ్వాన పత్రిక మీద ముఖ్య అతిధి నరేంద్ర మోడీ చిత్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను ముద్రించింది ప్రభుత్వం.
ఇక సందు దొరికింది, రాజకీయం మొదలెడదాం అన్నట్టుగా ఈ ఆహ్వాన పత్రిక మీద జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బొమ్మను ముద్రించలేదని, బాబు ఇక్కడ తన బుద్దిని బయటపెట్టారని, అసలు కూటమి ఏర్పాటు, దాని విజయానికి మూల స్తంభమైన పవన్ ఫోటోను బాబు కుట్ర పూరితంగానే పక్కన పెట్టారంటూ జనసైనికులను రెచ్చకొట్టే పనిలో పడ్డారు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు.
బాబు అరెస్టయి జైల్లో ఉంటె పవన్ రోడ్డు మీద పడుకుని తన నిరసన తెలిపి, టీడీపీ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఊపిరి పోస్తే ఇప్పుడే అదే పవన్ ను పక్కన పెట్టి బాబు కేవలం తన ఫోటోను మాత్రమే ముద్రించుకున్నారని, మీరు ఎప్పటికి టీడీపీ పార్టీకి జెండా కూలీలుగా మాత్రమే మిగిలుతారంటూ టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య పొగ పెట్టే కార్యక్రమానికి తెరలేపింది వైసీపీ.
అయితే ఏ ప్రభుత్వ కార్యక్రమానికైనా ప్రభుత్వం నుండి కొన్ని ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అధికారులు వాటిని దృష్టిలో ఉంచుకునే ఆచి తూచి వ్యవహారాలు చక్కబెడతారు. ఆహ్వాన పత్రికలో డిప్యూటీ సీఎం గా పవన్ ఫోటో వెయ్యలేదు అంటే అది పవన్ ను అవమానించినట్టుగా భావించడానికి లేదు.
ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఏది అవసరమో అంతవరకూ మాత్రమే ఉంటుంది. అంతేకాని నాకు సీట్లు రాలేదు కానీ ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, అంటూ జగన్ మాదిరి మారం చేయడానికి పవన్ ఏమి వైసీపీ మాయలో లేరు. అయినా ఇటువంటి చిన్న విషయాలతో వైసీపీ చేసే చిల్లర రాజకీయాలకు కూటమి పొత్తు విచ్ఛిన్నం చేయడం సాధ్యం కానీ పని అనేది వైసీపీ గ్రహించాలి.
అటు సీఎం గా బాబుకి, పవన్ మీద ఎంత ప్రేమ ఉందో, అలాగే డిప్యూటీ సీఎం గా పవన్, బాబు ను ఎంత గౌరవంగా చూస్తారో ఇప్పటికే రెండు పార్టీల క్యాడర్ కు పూర్తి స్పష్టత వచ్చింది. ప్రభుత్వం లో పవన్ కు ఎక్కడ ప్రాధాన్యత తగ్గకుండా అవసరమైన చర్యలను, ఒక రకంగా చెప్పాలంటే అవసరానికి మించిన స్వేచ్ఛను బాబు పవన్ కు ఇచ్చారు, ఇస్తున్నారు కూడా.
అలాగే పవన్ కూడా సమయం సందర్భం చిక్కినప్పుడల్లా బాబు నాయకత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నానంటూ పలుమార్లు బహిరంగానే వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజకీయ ఉచ్చులో పడడానికి ఇరు పార్టీల శ్రేణులు సిద్ధంగా లేరనేది వైసీపీ గ్రహించాలి.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…