
ఈ సంఘటనలతో ప్రత్యక్షంగా రోజా ప్రమేయం ఉన్నా, లేకున్నా గానీ, రోజా అడుగుపెట్టిన తర్వాతే ఇవన్నీ చోటు చేసుకోవడంతో… పొలిటికల్ వర్గాల్లో ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర పడింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రోజా గెలిచినప్పటికీ, వైసీపీ ఓడిపోవడానికి కారణం కూడా ఆమె ఆ పార్టీలో ఉండడమే అంటూ ప్రచారం చేసారు. సెంటిమెంట్స్ విశ్వసించే సాధారణ ప్రజానీకంలోకి కూడా రోజా విషయం చాలా బలంగా వెళ్లిపోయింది. దీంతో ఆమె పార్టీ మారుతోంది అంటే ఇతర నాయకుల మాదిరి అది చిన్న వార్త కాదు.
అందుకే మీడియా వర్గాలు ప్రసారం చేసిన వెంటనే రోజా కూడా తగిన వివరణ ఇచ్చుకున్నారు. ఇది విన్న తర్వాత ‘జనసేన’ పార్టీ అభిమానులు ఊపిరి పీల్చుకుని ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఎక్కడ జనసేనలోకి వచ్చేస్తుందో అని కంగారుపడిన అభిమాన వర్గానికి ఊరటనిచ్చే విధంగా తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని కుండబద్దలు కొడుతూ చెప్పారు. తన జీవితకాలం మొత్తం వైసీపీతోనే గడిపేస్తానని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది.
తల, తోక లేని జనసేన పార్టీలోకి తాను వెళ్ళేదేంటి… అంటూ రోజా ఒకింత జనసేనను కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పటికీ, అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. జనసేనలోకి అడుగుపెడితే పవర్ స్టార్ పరిస్థితి ఏం కానూ? అంటూ కలత చెందిన అభిమానగణానికి ఓ తీపి కబురును అందించింది రోజా. దీంతో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేఫ్… తమ పార్టీ జనసేన కూడా సేఫ్… అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రోజా లెగ్ పవర్… పవన్ ఫ్యాన్స్ ను అలా ఆనందించేలా చేస్తోందన్న మాట..!
నిజానికి రోజా అంటే భయపడేది ‘ఐరన్ లెగ్’ అన్న ముద్ర ఒక్కటే కాదు, వైసీపీలో చేరిన తర్వాత రోజా వ్యవహారశైలి ప్రతిదీ వివాదాస్పదం కావడం అతి పెద్ద మైనస్ గా విశ్లేషకులు పేర్కొంటారు. ముఖ్యంగా అసెంబ్లీలో రోజా నాలుక బయటపెడుతూ రోజా వ్యవహరించిన తీరు మహిళా లోకం తలదించుకునేలా చేసింది. ఇలాంటి వ్యక్తులు జనసేనలో ఉంటే, అది పవన్ పరువును తీసే విషయంగా మారుతుంది. కనుక రోజా అంటేనే జనసేన అభిమానులు భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ‘జనసేన’ సిద్ధాంతాలకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రోజా ఇమేజ్ ఏ మాత్రం సూట్ కాదన్నది అభిమానుల మాట.
కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లు… స్వయంగా రోజానే ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే విషయం చెప్పడంతో అంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుందా..!
Mahi Gaur brings an intoxicating wave of monsoon magic to the fashion spotlight with an…
418, the Telugu horror-thriller presented by Prashanth Neel, was supposed to release on July 31,…