
మొదటి సారి మీడియా ముందుకు వచ్చి కరోనా పెద్ద విషయం కాదని, పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో పోయే జబ్బని జగన్ చెప్పి తీవ్ర దుమారం రేపారు. ఆ తరువాత ప్రెస్ మీట్లో కరోనా అనేది దక్షిణ కొరియాలో పుట్టిందని చెప్పి ఇంకో తప్పు చేశారు. దీనితో మీడియా ముందుకు రావడం పూర్తిగా తగ్గించేశారు.
కొంత గ్యాప్ తరువాత ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన జగన్ ఆచితూచి మాట్లాడారు. ప్రతి విషయం మీద చిన్న చిన్న చిట్స్ రాసుకుని వచ్చి జాగ్రత్త గా చదివేశారు. అక్కడక్కడా చిన్న చిన్న పదాలు తప్పులుగా పలికినా, పెద్ద పెద్ద తప్పులు అయితే చెయ్యలేదు. సమావేశం తరువాత మీడియాని ప్రశ్నలు అడగనివ్వలేదు.
దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఊపిరి పీల్చుకుంది. ఇక ప్రెస్ మీట్ విషయానికి వస్తే జగన్ పక్క రాష్ట్రాల నుండి ఆంధ్ర ప్రజలు రావొద్దని, రావాల్సి వస్తే 14 రోజుల పాటు గవర్నమెంట్ అధీనంలో ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు. అలాగే ఈ వైరస్ వ్యాప్తి ని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఏకరవు పెట్టి, వాలంటీర్ల ను పొగడ్తలతో ముంచెత్తారు.
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…
One interesting pattern in Anil Ravipudi’s career is becoming hard to ignore. He rarely sticks…