పులివెందులలో మరో పోరుకి జగన్ సిద్ధమా.?

మొన్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారితే ఇక ఆ ఎన్నికల ఫలితాలు టీడీపీ లో దీపావళి సౌండ్లను తేగగా వైసీపీ లో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ ను మిగిల్చింది.

అయితే ఇప్పుడు అదే తరహాలో మరోసారి పులివెందుల ఉపఎన్నికలకు వైసీపీ సిద్ధమా.? అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణం రాజు వైస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.

ADVERTISEMENT

అసలు విషయానికొస్తే, 2024 ఘోర ఓటమి తరువాత 11 సీట్లతో ఉన్న వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. అయితే ప్రజలు తమకివ్వని హోదా కూటమి ప్రభుత్వం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న వైసీపీ ఆ కారణాన్ని సాకుగా చూపిస్తూ అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు.

అయితే ఈ నెల 18 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న ఈ తరుణంలో ఈ సమావేశాలకైనా వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్ హాజరవుతారా.? లేదా అన్న చర్చ మరోసారి ఏపీ రాజకీయాలలో చక్కర్లు కొడుతోంది.

ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 (4) ప్రకారం ఒక రాష్ట్ర శాసన సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆయన్ను అనర్హుడిగా ప్రకటించవచ్చు అనే నియమం ఉందని, అలాగే ఒక పార్టీకి కనీసం 18 సీట్లు లేకుండా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని డిప్యూటీ స్పీకర్ RRR వైసీపీ కి ఒక స్ఫష్టమైన సందేశాన్ని అందించారు.

దీనితో కూటమి ప్రభుత్వం జగన్ అనర్హత పై సీరియస్ గా ఉందా అన్న చర్చ జరుగుతుంది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో స్పీకర్ అయ్యన పాత్రుడు కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ వైసీపీ ఎమ్మెల్యే లకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయినా వైసీపీ వైకిరిలో ఎటువంటి మార్పు కనిపించలేదు.

ఇలా వైసీపీ నేతల చర్యల పై ప్రభుత్వానికి ఒక స్ఫష్టమైన విధానం ఉన్నప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే అసెంబ్లీ హాజరు పట్టిలో దొంగ చాటుగా సంతకాలు చేసిన వైనాలు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి.

ఒక చెల్లి షర్మిల సైతం ప్రజా ఓట్లతో ఎమ్మెల్యే లుగా గెలిచి ప్రజా సొమ్మును జీతాలుగా తీసుకుంటూ ప్రజా సమస్యల పై ప్రభుత్వం తో చర్చించేందుకు, పరిష్కారాలను సూచించేందుకు అసెంబ్లీకి రారా.? అటువంటి సందర్భంలో వైసీపీ పులివెందుల ఎమ్మెల్యే నుంచి మిగిలిన 10 మంది ఎమ్మెల్యే లు సైతం వారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలంటూ డిమాండ్ చేస్తూనే వస్తున్నారు.

అయితే పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష నాయకులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ సవాళ్లు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఓటమితో వారే అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో వైసీపీ ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఇటు ప్రజలు సైతం విస్తుపోతున్నారు.

అయితే అటు ప్రభుత్వం ఇటు వైసీపీ ఇద్దరు కూడా వారి వారి విధానాలపై స్పష్టమైన అభిప్రాయం తో ముందుకెళ్తున్న ఈ తరుణంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన ఈ అనర్హత వేటు అంశం పై రూల్ బుక్ ను పూర్తిగా తనిఖీ చేసి, మరియు నిపుణుల అభిప్రాయం తెలుసుకుని అవసరం అనుకుంటే ఎథిక్స్ కమిటీని కూడా సంప్రదించి ముందుకెళ్తామంటూ ప్రకటించారు.

మరి ఏపీ అసెంబ్లీ తన నిర్ణయంతో ఇతర రాష్ట్రాల శాసన సభలకు ఒక ఉదాహరణగా నిలవబోతుందా.? ఇలా అధికారం కోల్పోయి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న విపక్ష పార్టీల నాయకులకు ఏపీ అసెంబ్లీ ఒక హెచ్చరికను పంపగలదా.? లేదా అనేది వేచి చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Spirit: Will Sandeep Vanga Correct Himself?

Prabhas and Sandeep Reddy Vanga’s Spirit continues to remain one of the most talked-about upcoming…

4 hours ago

Constant Ticket Inflation is Pushing Audiences to the Edge

The commercial strategy surrounding the release of Peddi has exposed a worrying trend in regional…

4 hours ago