
తెలుగు సినిమాలలో శరీరాలు వేరు కానీ మనసులు ఒకటే అంటూ హీరోహీరోయిన్లు పాడుకుంటున్నట్లుగా, ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు కూడా రాష్ట్రాలు వేరయినప్పటికీ మా ఆలోచనలు ఒకటే అన్నట్లు వ్యవహరిస్తుంటాయి.
రెండు పార్టీల అధినేతలు ఇంట్లో కాలక్షేపం చేస్తుండటం మొదలు, శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడం వరకు అంతా సేమ్ టూ సేమ్‌గానే ఉంటుంది. చివరికి ఇరు పార్టీ నేతల (జగన్, కేటీఆర్) పాదయాత్రల షెడ్యూల్ కూడా వచ్చే ఏడాదిలోనే!
తాజాగా సీజేపీ ఆందోళనల నేపధ్యంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ కూడా ఒకలాగే ఉండటం యాదృచ్చికమనుకోవాలా లేక రెండు పార్టీల రాజకీయ ఫార్మాట్ ఒకటే కావడం వలన అనుకోవాలా?
డీఎస్సీ అవకతవకలకు నాతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఇక్కడ వైసీపీ ఆందోళనలు చేస్తుంటే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా విద్యాశాఖని నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి ఆ పదవిని వేరే వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది.
ఈ ఫార్మాట్‌లో మరో గమ్మతైన విషయం ఏమిటంటే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వైసీపీ రెండూ కూడా సీజేపీ ఆందోళనలకు మద్దతు పలుకలేదు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని విమర్శించలేదు.
లాభనష్టాలు లెక్కగట్టుకున్న తర్వాత కేటీఆర్ మాత్రం ఒకసారి విద్యార్ధులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కానీ వైసీపీలో ఎవరూ ఆ మాత్రం ధైర్యం కూడా చేయలేకపోయారు.
కానీ సీజేపీ స్పూర్తితో జెన్-జీ పేరుతో ఇక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు వైసీపీ, అక్కడ ఆ శాఖ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతున్నాయి.
వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల భిన్నత్వంలో ఇంత ఏకత్వం చూస్తున్నప్పుడు, రాష్ట్ర విభజన సమయంలో “భౌగోళికంగా విడిపోదాం… అన్నదమ్ముల్లా కలిసుందాం,”అని బహుశః జగన్‌ని ఉద్దేశ్యించే కేసీఆర్ అన్నారేమో? అని డౌట్!
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…