
YSRCP's Changing Capital Strategy
వైసీపీ తన రాజకీయంతో ఒక్కో ప్రాంత ప్రజలను దూరం చేసుకుంటుందా.? రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ చేసిన ప్రకటనతో తన ప్రత్యర్థి పార్టీని రాజకీయంగా బలమైన దెబ్బకొట్టగలిగాం అనుకున్న వైసీపీ చివరికి ఆ ప్రకటనే తన పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారింది అని గ్రహించలేకపోతుందా.? అందుకు ఇప్పటికి రాష్ట్ర రాజధాని పట్ల వైసీపీ కి ఒక స్పష్టమైన అభిప్రాయం లేకుండా పోయిందా.?
కేవలం అమరావతి మీద ఉన్న రాజకీయ అక్కసు ను చల్లార్చుకోవడానికి మూడు రాజధానులు అని, విశాఖ రాజధాని అని ఇక తాజాగా మావిగన్ అంటూ మూడు భిన్నమైన ప్రకటనలు చేసింది వైసీపీ. అయితే ఏ ఒక్క దానిపై కూడా మాట నిలబెట్టుకోలేకపోయింది. వైసీపీ తన మూడు రాజధానుల ప్రకటనతో కేవలం అమరావతి ప్రాంత ప్రజల వ్యతిరేకతను మాత్రమే ఊహించింది, అంచనా వేయగలిగింది.
ఒకటి పోతే ఏముంది రెండు పట్టాం అనుకున్న వైసీపీ చివరికి మూడు ప్రాంతాల ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మూడు రాజధానుల నిర్ణయంతో వైసీపీ అమరావతిలో పూర్తిగా రాజకీయ సమాధి నిర్మించుకుంది. ఇక విశాఖే రాజధాని అంటూ ఋషి కొండా ప్యాలస్ నిర్మించినా ఫలితం లేకుండా పోయింది.
అయితే విశాఖ ప్రజలు వైసీపీ రాజధాని ప్రకటనను కానీ అందుకు బలం చేకూర్చేలా జగన్ నిర్మించిన ఋషి కొండ ప్యాలస్ ను కానీ పట్టించుకోకుండా రాజకీయంగా వైసీపీ ని పూర్తిగా పక్కనపెట్టేసారు. రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ చేసిన రాజకీయాన్ని దగ్గరగా చుసిన విశాఖ ప్రజలు ఓటు తో వైసీపీ కి తమ రిటర్న్ గిఫ్ట్ రుచి చూపించారు.
ఇక తాజాగా రాజధాని విషయంలో జగన్ చేసిన మావిగన్ ప్రకటనతో విశాఖ వాసులకు తమ ప్రాంతం పై, తమ ప్రాంత అభివృద్ధి పై వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి పట్ల పూర్తి స్పష్టత రావడంతో ఇక రానున్న రోజులలో వైసీపీ విశాఖకు సానుకూలంగా ఎటువంటి ప్రకటనలు చేసినా దాన్ని విశాఖ వాసులు నమ్మే అవకాశం లేకుండా చేసుకున్నారు.
గత ఐదేళ్లు విశాఖే రాజధాని అంటూ అమరావతి పై విషం చిమ్మిన వైసీపీ నేడు అమరావతిని వద్దని, విశాఖను కాదని మావిగన్ అంటూ మాట మార్చడం పై విశాఖ, ఉత్తరాంధ్ర వాసులు వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దానికి తోడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పాటుగా ఉండే భోగాపురం ఎయిర్ ఫోర్ట్ విషయంలో వైసీపీ చూపిన ద్వంద్వ వైఖరి ఆ ప్రాంత ప్రజలను పూర్తిగా వైసీపీ కి దూరం చేసింది.
ఇలా వైసీపీ తన అనాలోచిత ప్రకటనలతో ఒక్కో ప్రాంత వాసుల వ్యతిరేకతను మూటకట్టుకుంటూ ఒక్కో ప్రాంతంలో వైసీపీ కి రాజకీయ సమాధి కట్టుకుంటుంది. ఇలా అయితే రేపటి రోజున జగన్ మావిగన్ ప్రకటనకు మచిలీపట్నం వాసులు మద్దతుగా నిలబడతారా.? విజయవాడ ప్రజలు వైసీపీ కి విజయం కట్టబెడతారా.? గుంటూరు ఘాటు రుచి వైసీపీ తట్టుకోగలుగుతుందా.?
ఇప్పటికే అమరావతికి దూరమై, విశాఖను దూరం చేసుకుని, ఉత్తాంధ్రకు వ్యతిరేకమై…ఇలా తన పార్టీ పట్ల తామే ప్రజలలో వ్యతిరేక పవనాలు వీచేలా చేసుకుంటున్నారు.
Generally, when a sequel for a blockbuster film is about released, there is a lot…
'తెలంగాణ' అనే ఈ ఒక్క పదం ఇన్నాళ్ళుగా రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యింది, రాజకీయ నాయకులకు మాత్రమే అస్త్రంగా మారింది…