Telugu

పుట్టింటి నుండి ఎంత కొట్టేస్తే మీరు పార్టీ పెట్టగలిగారు?

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ జెండా పీకేసి పార్టీని నమ్ముకున్న నాయకులను గాలి కొదిలేసి., తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడంలో తడబడిన చెల్లి షర్మిలకు కనీస మద్దతు ఇవ్వలేని జగన్ అండ్ కో ఇప్పుడు మాత్రం తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ADVERTISEMENT

తెలంగాణాలో వైసీపీ పార్టీకి అనధికార మిత్రుడైన కేసీఆర్ గెలుపుకి రేవంత్ అడ్డుగోడలా మారాడనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా వర్గీయులు. టీడీపీ తనకు పుట్టినిల్లు అని అక్కడ నుండి వచ్చిన తానూ చంద్రబాబుకి ఎంత మర్యాద ఇస్తానో అలాగే అత్తారిల్లుగా మారిన కాంగ్రెస్ పార్టీకి అంతే విధేయతతో తన బాధ్యత నిర్వహిస్తాను అంటూ ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

ఇప్పుడు ఇదే వ్యాఖ్యలను తప్పుపడుతూ వైసీపీ సోషల్ మీడియా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్, టీడీపీ పార్టీలను ఉద్దేశించి ఓ ఆస్తకికరమైన పోస్ట్ పెట్టారు. అసలు విషయానికి వస్తే….”కాంగ్రెస్ తో పెళ్లి చేసుకున్నందుకు పుట్టిల్లు అని చెప్పుకునే టీడీపీ పార్టీ ఎంత కట్నం ఇచ్చింది? ఆ కట్నం డబ్బుతోనే పీసీసీ పదవి సంపాదించుకున్నావా? ఒకవేళ అత్తారింట్లో గొడవ పడితే తిరిగి పుట్టింటి వచ్చేస్తావా”? అంటూ వైసీపీ తన X మాధ్యమంలో పోస్ట్ షేర్ చేసింది.

అంతా బాగానే ఉంది..,కానీ అసలు వైసీపీ పార్టీకి పుట్టిల్లే కాంగ్రెస్ పార్టీ అన్న విషయం మరిచినట్టున్నారు సదరు వైసీపీ శ్రేణులు. వైసీపీ భాషలోనే చెప్పాలనుకుంటే అసలు పుట్టింటిని అడ్డుపెట్టుకుని పదవులు పొంది ముఖ్యమంత్రి హోదాలు అనుభవించి దోచేసిన వేల కోట్ల ప్రజాదననాన్ని ఆసరాగా చేసుకుని పాలుతాగి తల్లి రొమ్ము గుద్దినట్టు డబ్బు అహంకారంతో పుట్టింటిని నాశనం చేసి అక్కడ కొట్టేసిన సొమ్ముతో పార్టీని స్థాపించిన మీరా రేవంత్ పై కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసేది అంటున్నారు టి. కాంగ్రెస్ నేతలు, రేవంత్ అభిమానులు.

మీకు మాదిరి రేవంత్ పుట్టింటిని నామరూపాలు లేకుండా నాశనం చేసి అవసరం తీరాక ఆ పుట్టింటి పైనే నిందలు మోపి తమ రాజకీయ జీవితానికి బాటలు వేసుకోలేదు. అలాగే మీ చెల్లి షర్మిల మాదిరి పెట్టుకున్న పార్టీని నిలబెట్టుకోలేక ఆ పార్టీతో కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగించలేక మళ్ళీ పుట్టింటి గడప తొక్కలేదు.జగన్, షర్మిల ఇద్దరు ఒకరినే టార్గెట్ చేస్తూ తమ రాజకీయ విమర్శలు కొనసాగించడం చూస్తుంటే “ఆపండ్రా మీ ఫామిలీ డ్రామాలు” అంటూ చెప్పే ఓ సినిమా డైలాగ్ గుర్తురాకమందు.

కష్టమైన నష్టమైనా.. విమర్శలు చేసినా, విమర్శలు ఎదుర్కున్నా, సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైనా ఓర్పు తో నిలకడగా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి అంటూ రేవంత్ పై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు రేవంత్ సహచరులు.”పుట్టింటి నుండి ఎంత కొట్టేస్తే మీరు పార్టీ పెట్టగలిగారు”?..అలాగే “ఎంత ఆశించి మీ చెల్లి షర్మిల తిరిగి పుట్టింటి వచ్చిందో” కూడా ఓ పోస్ట్ పెడితే అందరు తెలుసుకుంటారు కదా!అంటూ అదే సోషల్ మీడియా వేదికగా వైసీపీకి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. మీ సంగతి మీరు చూసుకోండి అంటూ చెల్లి చెప్పినా అన్నకు ఇంకా జ్ఞానోదయం కాలేదేమో అంటున్నారు టి. టీడీపీ శ్రేణులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

2 hours ago

AP Civic Polls: TDP Gets 11 Corporations, Jana Sena 4, BJP 2

The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…

2 hours ago