
తమిళనాడు ఎన్నికలలో మొదటి ప్రయత్నంతోనే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న DMK, AIADMK, బీజేపీ పార్టీలను వెనక్కి నెట్టి ఒంటరి పోరుతో విజయం దిశగా దూసుకుపోతుంది విజయ్ TVK పార్టీ. దీనితో ఇప్పుడు TVK విజయం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో ఆ విజయం గెలుపు లో తమకు క్రిడిట్ ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో రంగంలోకి దింగింది. విజయ్ తో వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి టచ్ లో ఉన్నారని, విజయ్, జగన్ ఇద్దరు ప్రాణ స్నేహితులని గతంలో ఒక వివాహ వేడుకలో విజయ్ – జగన్ కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ విజయ్ గెలుపులో తమ భాగస్వామ్యం అన్నట్టుగా ప్రచారాలు సాగిస్తున్నారు.
జగన్ ప్రాబల్యంతో ఏపీలో అధికారం కాదు కదా కనీసం ప్రతిపక్షం కూడా పొందలేని వైసీపీ తమిళనాడులో విజయ TVK గెలుపు పై ఎటువంటి ప్రభావం చూపగలదు.? జగన్ కు స్టాలిన్ కు మధ్య మంచి రాజకీయ బంధాలు ఉన్నమాట జగమెరిగిన సత్యం.
వైసీపీ మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం స్టాలిన్ DMK కోసం తమినాడు ప్రచార కార్యక్రంలో పాల్గొన్నారు. అలాగే స్టాలిన్ పరిపాలన కూడా బాగుందని, జగనన్న మాదిరే స్టాలిన్ కూడా ప్రజాఆమోద పాలన చేసారంటూ స్టాలిన్ భజన చేసారు. DMK మరోసారి అధికారంలోకి వస్తుందని, స్టాలిన్ రెండో పర్యాయం కూడా సీఎం కావడం ఖాయమంటూ శపధాలు కూడా చేసారు.
కానీ సీన్ కట్ చేస్తే, ఇప్పుడు DMK ఏపీలో వైసీపీ మాదిరి ప్రతిపక్షానికి కావాల్సిన సీట్లు కూడా రాబట్టుకోలేక మూడో స్థానికి పరిమితం అయ్యింది. ఈ నేపథ్యంలో చాల ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేని విజయంతో దూసుకుపోతున్న విజయ్ TVK గెలుపులో వైసీపీ ‘విజిల్’ కొట్టాలని భావిస్తుంది. ఇందుకు విజయ్ అభిమానులు అంగీకరిస్తారా.?
There was a time when a release date was announcement in Tollywood it carried real…
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…