
వెయ్యి ఎలుకలు తిన్న ఎలుక హజ్ యాత్రకు బయలుదేరిందనే ఓ ఉర్దూ నానుడి ఉంది. అలాగే 5 ఏళ్ళ పాటు రాష్ట్రాన్ని, ప్రతిపక్షాలను, ప్రజలను, మీడియాని, అధికారులను రాచిరంపాన్న పెట్టిన జగన్, ఇపుడు విలువలు విశ్వసనీయత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది.
ఆరోజు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం ఏవిదంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు.
చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించి వైసీపి నేతలు స్వీట్లు పంచుకుని, టపాకాయలు కాల్చుకొని పండుగ చేసుకోవడం పైశాచిక ఆనందమే కదా?
ఆనాడు ముఖ్యమంత్రిననే విషయం మరిచిన్నట్లు శాసనసభలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి మాట్లాడిన మాటలు, బయట సభలలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి ఏవిదంగా మాట్లాడేవారో అందరికీ తెలుసు. చివరికి సొంత చెల్లి వైఎస్ షర్మిల కట్టుకున్న చీర గురించి మాట్లాడింది కూడా జగన్మోహన్ రెడ్డే కదా?
రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందంటూ వైసీపి సొంత మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, “నేనేమీ చట్టానికి అతీతంగా వ్యవహరించడం లేదు. ఎవరినీ శిక్షించాలనుకోవడం లేదు.
కానీ చట్టాన్ని ఉల్లంఘించినవారిని, పదవీ అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడినవారికి చట్ట ప్రకారం శిక్షలు తప్పవని మాత్రమే చెపుతున్నాను.
అలా చట్టాన్ని ఉల్లంఘించి అవినీతికి పాల్పడినవారి పేర్లనే నేను ‘రెడ్ బుక్’లో నోట్ చేసుకున్నాను. నేను దానిని రహస్యంగా దాచిపెట్టలేదు. ప్రజలకు అది చూపించే ఓట్లు అడిగాను. ప్రజలు కూడా అవినీతిపరులకు శిక్షలు పడాలనే మమ్మల్ని గెలిపించారు.
మా ప్రభుత్వాన్ని వైసీపి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అని విమర్శిస్తోందని మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా తనపేరుతో రిజిస్టర్ చేయించుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా?
ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలు చేసిన వారిని, భూకబ్జాలు చేసినవారిని విడిచి పెట్టేయాలా?అని నారా లోకేష్ ప్రశ్నించారు.
దానిపై వైసీపి స్పందిస్తూ ఓ పక్క బాధ్యత, నమ్రత అంటూ నీతులు వల్లిస్తూనే, “పిచ్చోడి చేతిలో రాయి, పప్పు చేతిలో అధికారం రెండూ ఒకటే. బాధ్యత, నమ్రత, రాజ్యాంగంమీద గౌరవం ఏమీ కనిపించట్లేదు. ప్రభుత్వాన్ని నడపడమంటే…గోళీల ఆటని “నిక్కర్’’ మంత్రి అనుకుంటున్నాడు. న్యాయ ప్రక్రియను, చట్ట ప్రక్రియను మీరి… వ్యవహరిస్తే.. ఆ ఎర్రబుక్కే నీకు శాశ్వత సమాధి కడుతుంది అంటూ మంత్రి నారా లోకేష్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
ఈ నోటి దురుసు, ఈ వంకర మాటలు, ఈ సైకో, శాడిస్ట్ ధోరణే వైసీపి ఓటమికి కారణం. అయినా నారా లోకేష్‌ని ఉద్దేశ్యించి ఈవిదంగా అవహేళన చేయడం గమనిస్తే ‘కుక్క తోక వంకర’ని అనుకోకతప్పదు.
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…