అభివృద్ధి కంటే వినాశనానికే మద్దతెక్కువా..?

వైసీపీ రాష్ట్ర విధ్వంసాన్ని కోరుకుంటుంది…కానీ బయట శత్రువులు లేరు, టీడీపీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తుంది బయటంతా శత్రువులే. వైసీపీ కి టీడీపీ మధ్య ఉన్న తేడా ఇక్కడే పూర్తిగా స్పష్టమవుతుంది. సొంత రాష్ట్ర వినాశనంతో పొరుగు రాష్ట్రాల అభివృద్ధికి మేలు చేస్తూ వైసీపీ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆపద్బాంధవుడిలా మారింది.

కానీ టీడీపీ ఏపీ అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తూ ఇరుగుపొరుగు రాష్ట్రాలకు పోటీనిస్తూ వారికి ఆగర్భ శత్రువుగా మారుతుంది. ఇటు తెలంగాణ విషయానికొస్తే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ అనుసరించిన మూర్కత్వపు విధానాలతో బిఆర్ఎస్ ప్రభుత్వం చాల వరకు లాభపడిందనే చెప్పాలి.

ADVERTISEMENT

వైసీపీ నిరంకుశత్వానికి, నియంతపాలనకు, కక్ష్య రాజకీయాలకు భయపడి ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారు సైతం హైద్రాబాద్ కు మకాం మార్చిన వైనాలు చూసాం, అలాగే కొన్ని పరిశ్రమలు ఇటు ఏపీని వదిలి చెన్నై కి తరలిపోయిన విడ్డురాలు గమనించాం. 2019 వరకు ఏపీలో హైద్రాబాద్ తో పోటీ పడి మరి పరుగులెత్తిన రియల్ ఎస్టేట్ ఆ తరువాత ఏపీ నుండి ఒక్కసారిగా అదృశ్యమయ్యింది.

రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని అందించడంలో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అవడంతో ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు బిఆర్ఎస్ నాయకులు. దీనితో ఏపీకి తరలి రావాల్సిన పెట్టుబడులు ఏపీ నుంచి హైద్రాబాద్ కు తరలిపోయాయి. అయితే వైసీపీ నుండి తమ రాష్ట్రానికి వస్తున్న పరోక్ష మద్దతుతో బిఆర్ఎస్ తన రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకుంది.

దీనితో తెలంగాణ లో బిఆర్ఎస్ కు ఎదురులేదు, ఏపీలో వైసీపీ కి పోటీ లేదు అన్న చందాన ఈ ఇద్దరు పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా తక్కువంచనా వేసి చివరికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఇప్పటికి బిఆర్ఎస్ నాయకులకు వైసీపీ మీద ప్రేమ చావలేదు, టీడీపీ మీద ద్వేషం చల్లారలేదు.

అలాగే ఇటు తమిళనాడు లో అధికారంలో ఉన్న డీఎంకే కూడా బీజేపీ వ్యతిరేక విధానాలతో ముందుకెళ్లడంతో ఇటు ఏపీలో ఎన్డీయే లో భాగమైన టీడీపీ కి దూరంగా వైసీపీ కి దగ్గర ఆ పార్టీ రాజకీయ బండలను కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ వైసీపీకి డీఎంకే కి ఉన్న సానుకూల అంశం హింతుత్వం.

సెక్యులరిజం ముసుగులో హిందూ మతం పై విషం చిమ్మడంలో ఈ రెండు పార్టీలు కూడా ఒకే సిద్ధాంతంతో ముందుకెళ్తాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో వైసీపీ నడిపే తెరచాటు రాజకీయాలతో జగన్ ఇప్పటికి బైలు మీద బయట తిరుగుతున్నారు. ఇలా సొంత రాష్ట్ర అభివృద్ధిని, ఇక్కడి ప్రజల ప్రగతిని తన రాజకీయ లబ్ది కోసం తాకట్టు పెడుతున్న వైసీపీ కి ఎటు చూసిన బయట శత్రువులు లేరనే చెప్పాలి.

ఇక రాజధాని నిర్మాణం, రాష్ట్ర ప్రగతి, ప్రజల జీవన ప్రమాణాల ఎదుగుదల అంటూ అభివృద్ధి మంత్రం తో ముందుకెళ్తున్న టీడీపీ కి మాత్రం ఇటు తెలంగాణ నుంచి బిఆర్ఎస్ పక్కలో బల్లెం మాదిరి తయారయ్యింది, ఇక ఎన్డీయే లో భాగం కారణంగా ఇటు తమిళనాట టీడీపీ కి ఆనాటి సానుకూల వాతావరణం లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే టీడీపీ కాకపోతే వైసీపీ, వైసీపీ కాకపోతే టీడీపీ అన్నట్టుగా పరిస్థితులు ఎప్పటికప్పుడు తారుమారవుతూ ఉంటాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

23 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

53 minutes ago