
YSRCP Targets Lokesh Over DSC Issue
ఢిల్లీ సీజేపీ నీట్ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచగలిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా తో మోడీసర్కార్ వెనక్కి తగ్గింది, దీనితో సీజేపీ తలపెట్టిన ఉద్యమం విజయగర్వంతో ముగిసింది.
అయితే అక్కడ సీజేపీ ఉద్యమ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని ఏపీలో వైసీపీ DSC లో అవకతవకలు అంటూ మరోసారి DSC అంశాన్ని రాజకీయ తెరమీదకు తెచ్చింది. విద్యాశాక మంత్రి గా లోకేష్ ఇందుకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మాదిరి రాజీనామా చెయ్యాలంటూ వైసీపీ తన X లో పోస్ట్ చేసింది.
మెగా DSC పేరుతో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడిందని, అందుకు పూర్తి బాధ్యత వహిస్తూ లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తాడంటూ వైసీపీ సీజేపీ రాజీనామా డిమాండ్ ను ఏపీ కి తెచ్చింది.
అయితే సీజేపీ ఉద్యమానికి ప్రత్యేక రాజకీయ కారణాలు లేవు, దానికి తోడు జెన్ జీల మద్దతు, బాధిత విద్యార్థుల సపోర్ట్ గట్టిగా ఉండడంతో సీజేపీ ఉద్యమం అనుకున్న లక్ష్యాలను అందుకోగలిగింది. కానీ ఇక్కడ వైసీపీ డిమాండ్ అందుకు తగ్గట్టుగా ఉందా.?
వైసీపీ చేస్తున్న లోకేష్ రాజీనామా డిమాండ్ కు తగ్గ బలమైన సమస్య కనిపిస్తుందా.? DSC లో అవకతవకలు అంటూ వైసీపీ గత కొన్ని నెలల నుంచి ప్రచారం చేస్తుంది. అయినా క్షేత్ర స్థాయిలో ఎటువంటి స్పందన కనిపించడం లేదు. వైసీపీ ప్రచారాలకు, జగన్ ప్రకటనలకు మద్దతుగా ప్రజామోదం లభించలేదు.
అటువంటి తరుణంలో వైసీపీ – సీజేపీ అవుతుందా.? అక్కడ నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ జరిగిందంటూ సాక్ష్యత్తు కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది, అందుకు తగ్గట్టే నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్షను నిర్వహించింది. దాని ఫలితంగా ఆ ఒత్తిడిని ఎదుర్కోలేక పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు విడిచారు.
లక్షల సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన చెందారు. ఇవన్నీ ప్రతిపక్షాల ఆరోపణలుగా కాకండా సామాన్యుడి ఆవేదనగా ప్రజలు భావించారు. అందుకే సీజేపీ నీట్ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా ప్రజల మద్దతుతో విజయం సాధించింది.
కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలు, ప్రకటనలు ప్రభుత్వాల పై విపక్షాలు చేసే విమర్శలుగానే పరిగణించబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో వైసీపీ ఫ్యాన్ కూటమి ప్రభుత్వం పై పైచేయి సాధించగలుగుతుందా.?
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…