Telugu

ఇంకా ఎంతకాలం.. ఈ నకిలీ ఆందోళనలు.. ఉక్కు పాదాలు?

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మాత్రమే ఏకైక అజెండాగా ముందుకు సాగాల్సిన ఈ సమయంలో గత రెండున్నరేళ్ళుగా నకిలీ సమస్యలు, నకిలీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కనుక ప్రభుత్వం కూడా వాటిని విస్మరించలేని పరిస్థితి నెలకొంది.

ఢిల్లీలో కాక్రోచ్ జనతాపార్టీ ఉద్యమంతో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం, దేశంలో చాల ప్రతిపక్ష పార్టీలకు మంచి స్పూర్తి కలిగించింది. వాటిలో వైసీపీ కూడా ఒకటి. అప్పటి నుంచి డీఎస్సీలో అవకతవకలు.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలంటూ, తమ వైసీపీ జెన్-జీ బ్యాచ్‌లతో ఆందోళనలు తీవ్రం చేసింది.

ADVERTISEMENT

కనుక ప్రభుత్వం కూడా ఎప్పటిలాగే శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉక్కుపాదంతో అణచి వేస్తామని హెచ్చరిస్తూనే ఉంది. అప్పుడు.. మీ అవినీతిని ప్రశ్నించే గొంతులను అణచివేస్తారా? అంటూ వైసీపీ ఎదురు ప్రశ్నించడం పరిపాటిగా మారింది.

కానీ డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని గట్టిగా వాదిస్తూ సీబీఐ విచారణకు పట్టుబడుతున్న వైసీపీ, దీనిపై కోర్టుకు వెళ్ళాలనుకోదు. వెళ్ళి డీఎస్సీలో అవినీతి అక్రమాలు జరిగాయని నిరూపించగలిగితే.. కనీసం న్యాయస్థానానికి నమ్మకం కలిగించగలిగితే అదే.. ప్రభుత్వాన్ని నిలదీస్తుంది కదా? అదే.. సీబీఐ విచారణకు ఆదేశిస్తుంది కదా? కానీ వెళ్ళదు.. ప్రభుత్వం ఉక్కుపాదం అనక మానదు.

గుంటూరు శాప్ కార్యాలయం ఎదుట ఘటనలు రహస్యంగా ఏమీ జరుగలేదు. డజన్ల కొద్దీ మీడియా ప్రతినిధులు, వారి కెమెరాల సాక్ష్యంగానే అన్నీ జరిగాయి. అయినా కూడా గూండాలు పాల్గొన్నారని ప్రభుత్వం, టీచర్లు కానివారు పాల్గొన్నారని వైసీపీ వాదించుకుంటున్నాయి. వారే మాపై దాడి చేశారని పరస్పరం వాదించుకుంటున్నాయి.

మీడియా సమక్షంలోనే కళ్ళకు కట్టినట్లు జరిగిన ఘటనలనే వక్రీకరిస్తున్నప్పుడు, అయితే వాటిలో అసలు ఏది?నకిలీ ఏది?ఎవరి వాదన నిజం? ఎవరి వాదన అబద్దం?అని ప్రజలలో సందేహాలు ఏర్పడవా? అంటే అలా ఏర్పడేలా చేసి సమాజంలో అలజడి సృష్టించడానికే వైసీపీ ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఓ సమస్యపై ప్రతిపక్షం ఆందోళన లేదా నిరసనలు చేయడం తప్పు కాదు కానీ వాటితో ప్రజలను భయపెట్టాలనుకోవడం సరికాదన్నారు. కూటమి పార్టీలను, తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సిన వైసీపీ, ఓ అరాచకశక్తిలా వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కనుక ప్రజలు కూడా వైసీపీ ఆందోళనల వెనుక అసలు ఉద్దేశ్యం గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాద్యాయులకు అన్యాయం జరిగిపోతోందని మొసలి కన్నీళ్ళు కార్చుతున్న వైసీపీ అధినేత జగన్‌, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద ఎందుకు డ్యూటీ చేయించారు? అని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

పాలన, అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన మంత్రులు నిత్యం వైసీపీ కుయుక్తులను పసిగడుతూ దానిని ఎదుర్కోవడానికి సమయం కేటాయించక తప్పడం లేదు. ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడాల్సిన వైసీపీ, ఇలాంటి రాజకీయ ఎత్తుగడలతో ప్రజలను నమ్మించాలని, పైచేయి సాధించాలని ఆరాటపడుతోంది. కానీ ఎంతకాలం?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

New Cockroach Fight: EC Chief Must Resign In 2 Days!

The cockroach janta party movement created history at the Jantar Mantra earlier by constituting the…

4 minutes ago

The Paradise Review Controversy: Why Telangana Vs Andhra?

Nani’s The Paradise opened with huge hype and record advance bookings, but the film has…

34 minutes ago