Telugu

వైసీపీకి మరో అవకాశం.. ఈసారైనా సత్తా చూపుకుంటే…

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికలలో వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉండి ఉంటే చాలా ప్రశాంతంగా జరిగేవి. బహుశః అప్పుడు వైసీపీ ఇంతకంటే మరికాస్త ఎక్కువ సీట్లే గెలుచుకునేదేమో?

కానీ రకరకాల వ్యూహాలతో ఈ ఎన్నికలను ఒక రాజకీయ చదరంగంగా మార్చేసింది. కానీ దాని వ్యూహాలన్నీ బెడిసికొట్టడంతో శాసనసభ ఎన్నికల కంటే అవమానకరంగా ఓటమి పాలైంది.

ADVERTISEMENT

కనుక ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికలలోనైనా వైసీపీ హుందాగా వ్యవహరిస్తుందనుకుంటే అప్పుడూ అలాగే వ్యవహరించి మరో గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది.

తాజాగా వైసీపీకి మరో చక్కటి అవకాశం లభిస్తోంది. రాష్ట్రంలో మిగిలిన 4 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ గురువారం నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఈసారి శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే అమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, బాపట్ల మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు.

కనుక ఈసారైనా వైసీపీ ఈ ఎన్నికలను కేవలం ఎన్నికలుగా భావించి, నామినేషన్స్‌ వేసి ఎన్నికలలో పోటీ చేసి గెలిచి సత్తా చూపించుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ ఈసారి కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మళ్ళీ ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు.

ఎన్నికల షెడ్యూల్:

నవంబర్‌ 14 నుంచి: నామినేషన్ల స్వీకరణ

నవంబర్‌ 16వ తేదీ: నామినేషన్ల దాఖలుకు గడువు

నవంబర్‌ 17: నామినేషన్స్‌ పరిశీలన

నవంబర్‌ 19: (మధ్యాహ్నం 3 గంటల వరకు) నామినేషన్ల ఉపసంహరణకు గడువు.

నవంబర్‌ 26: (ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) పోలింగ్‌

నవంబర్‌ 27: అవసరమైతే రీపోలింగ్‌ చేపడతారు.

నవంబర్‌ 30: (ఉదయం 8 నుంచి) ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Idupu Kayitham Controversy: Tabitha Sukumar Breaks Her Silence

The controversies surrounding Idupu Kayitham are not settling down even as the makers continue their…

17 minutes ago

Blind Game Review: A Snooze-Fest of A Crime Thriller

BOTTOM LINE A Snooze-Fest of A Crime Thriller PLATFORM ZEE5 RUNTIME 1Hr 53 Mins. What…

43 minutes ago