
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు ఆయన ప్రభుత్వంలో, పార్టీలో ప్రతీ ఒక్కరూ కూడా తమ వంటి నిజాయితీపరులు మరొకరు ఉండరని, తమ ప్రభుత్వం, పార్టీ అంత స్వచ్చమైనవి మరొకటి ఉండవని గొప్పలు చెప్పుకొంటుంటారు. ప్రజలందరూ మావైపే ఉన్నారు కనుక వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మావే అని కూడా చెప్పుకొంటారు.
కానీ వారి మాటలకు చేతలకు ఎక్కడా పొంతన ఉండదని అందరికీ తెలుసు. దీనికి తాజా నిదర్శనమే ఇది. తెలుగుదేశం లెటర్ హెడ్ మీద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పేరిట ఓ నకిలీ లేఖను సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం ఇన్చార్జిగా బండారు శ్రావణిని నియమిస్తున్నట్లు అచ్చెన్నాయుడు సంతకంతో ఆ లేఖలో ఉంది.
దీనిని టిడిపి వెంటనే ఖండించింది. నియోజకవర్గం టిడిపి శ్రేణులలో చిచ్చు పెట్టేందుకు ఇటువంటి నకిలీ లేఖలు సృష్టించి వైసీపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సోషల్ మీడియా ద్వారా కోరింది. దాంతో పాటు అచ్చెన్నాయుడు పేరిట వైసీపి సృష్టించిన ఆ నకిలీ లేఖపై ఫేక్ ముద్ర వేసి పెట్టింది.
జేసీ దివాకర్ రెడ్డి ప్రోత్సాహంతో బండారు శ్రావణి టిడిపిలో చేరారు. గత ఎన్నికలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేశారు కానీ వైసీపి అభ్యర్ధి జొన్నల గడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే స్థానిక టిడిపి నేతలకు, ఆమెకు మద్య కొన్ని విభేధాలు ఏర్పడ్డాయి.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు వారితో మాట్లాడి రాజీ కుదిర్చారు. ఈసారి ఎన్నికలలో శింగనమల టిడిపి అభ్యర్ధి ఎవరనేది చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని, కనుక అందరూ విభేధాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని గెలిపించుకోవాలని నారా లోకేష్ వారికి సూచించారు.
కానీ మళ్ళీ ఆమెకే శింగనమల టికెట్ ఇవ్వబోతున్నట్లు వైసీపి ఈ నకిలీ లేఖను సృష్టించి వదిలింది. తద్వారా నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులలో చిచ్చు పెట్టి విడదీసి తమవైపు తిప్పుకోవాలని వైసీపి ప్రయత్నిస్తోందని అర్దమవుతోంది.
గత ఎన్నికలలో శింగనమల నుంచి వైసీపియే గెలిచినప్పుడు, వచ్చే ఎన్నికలలో కూడా తప్పకుండా గెలుస్తామనే నమ్మకం ఉండాలి కదా?కానీ అప్పుడు గెలిచినా ఇప్పుడు ఓడిపోతామేమో అనే భయంతోనే ఇటువంటి నీచరాజకీయాలు చేస్తున్నట్లు భావించవచ్చు.
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…