
ఇంతకీ ఆయన బాధ ఏమిటంటే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురం, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన మండపేట రెండు నియోజకవర్గాలు ఆయన చేతిలో నుంచి జారిపోయాయి. దీంతో ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారైంది.
ఈ కధ 2019లో మొదలైంది. ఆ ఎన్నికలలో మండపేటలో బలమైన అభ్యర్ధి లేకపోవడంతో పిల్లిని అక్కడకు పంపించి రామచంద్రాపురం టికెట్ వేణుగోపాల్ కృష్ణకు ఇచ్చారు. అయిష్టంగానే మండపేట వెళ్ళిన పిల్లి అక్కడ ఓడిపోగా, రామచంద్రాపురం టికెట్ దక్కించుకొన్న వేణుగోపాల్ కృష్ణ గెలవడంతో ఒక్కసారిగా వారి బలాబలాలు మారిపోయాయి.
వేణుగోపాల్ కృష్ణకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి లభించింది. ఈ నాలుగేళ్ళలో రామచంద్రాపురం నియోజకవర్గంపై పట్టు సాధించారు. అయితే చాలా కాలం నుంచి పిల్లి కూడా పార్టీలోనే ఉంటూ కష్టకాలంలో జగన్కు అండగా నిలబెడ్డారు కనుక ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు.
పిల్లిని రాజ్యసభకు పంపడంతో మండపేట సీటు ఖాళీగా ఉందని భావించిన జగన్, ఆ సీటుని టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన తోట త్రిమూర్తులకు కేటాయించారు. మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించడంతో ఆయన మండపేటలో పనిచేసుకుపోతున్నారు.
మరోపక్క మంత్రి వేణుగోపాల్ కృష్ణ నియోజకవర్గంలో పిల్లి అనుచరులను తనవైపు తిప్పుకొంటూ, లొంగనివారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
కనుక పోగొట్టుకొన్న చోటే ఉంగరం వెతుక్కొనే ప్రయత్నంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మళ్ళీ రామచంద్రాపురంలో తిరుగుతున్నారు. అయితే ఈసారి అక్కడి నుంచి తన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తారని, కనుక రామచంద్రాపురం టికెట్ తన కుమారుడికే ఇవ్వాలని పిల్లి పట్టుబడుతున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే తన కుమారుడుని స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దింపేందుకు వెనుకాడనని పిల్లి హెచ్చరించారు.
అయితే జగన్ వారి పంచాయితీని ఇంకా తేల్చకపోవడంతో రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణుగోపాలకృష్ణ వర్గాల మద్య కోల్డ్ వార్ జరుగుతోంది. మంత్రి వేణు, పిల్లి వర్గీయులు రామచంద్రాపురం నియోజకవర్గం పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ జగన్ మంత్రి వేణు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గదిలో బండిస్తే పిల్లైనా తిరగబడుతుంది మరి సుభాష్ చంద్రబోస్ తిరగబడకుండా ఉంటారా?
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…
Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…