
కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ఆర్ధికమూలాలను దెబ్బ తీస్తూ ఆ పార్టీని బలహీన పరిచేందుకు ప్రయతీస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నంలో గుజరాత్కు చెందిన అమూల్ డెయిరీని రాష్ట్రానికి తీసుకువచ్చారు. ముందుగా టిడిపి సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సంగం డెయిరీలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయనను తప్పించేశారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కుటుంబం అధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ డెయిరీపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానిని దెబ్బతీసేందుకే అమూల్ డెయిరీని తీసుకువచ్చింది. ఈ విషయం సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుప్పం బహిరంగసభలో పరోక్షంగా చెప్పారు.
“రాష్ట్రంలో నా అక్కలు, చెల్లెమ్మమలు, అన్నలు, తమ్ముళ్ళని ఇంతకాలం హెరిటేజ్ డెయిరీ దోచుకొనేది. కానీ అమూల్ డెయిరీ వచ్చి పాలసేకరణ ధర పెంచడంతో హెరిటేజ్ డెయిరీ కూడా పెంచకతప్పలేదు. మీ అందరికీ మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే అమూల్ డెయిరీని రాష్ట్రానికి రప్పించి దాంతో ఒప్పందం చేసుకొన్నాము,” అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
అంటే రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన హెరిటేజ్ డెయిరీ జాతీయస్థాయికి చెందిన అమూల్ డెయిరీతో పోటీ పడవలసిన పరిస్థితి కల్పించారన్న మాట! ఒకవేళ దాంతో పోటీ పడలేకపోతే నష్టపోయి చ్వరికి మూసుకోక తపదన్న మాట!
అమూల్ని రప్పించడానికి అసలు కారణం ఇదైతే రాష్ట్రంలో పాడిరైతులకు మేలు చేసేందుకే తీసుకువచ్చామని కుప్పంలో జగన్ చెపుకొన్నారు. ఇంత దూరదృష్టి రాష్ట్రాభివృద్ధిపై చూపి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే నంబర్: 1 స్థానంలో ఉండేది కదా?
Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…