
Pawan Kalyan Orders Inquiry Into Road Damage
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత మొదలు గ్రామస్థాయి వరకు వైసీపీ నేతల ప్రవర్తన ఏ విధంగా ఉండేదో అందరూ కళ్ళారా చూశారు.
అయితే 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీలో హేమాహేమీల వంటి నేతలు ఒక్కసారిగా చల్లబడిపోయారు. ముఖ్యంగా ‘రెడ్ బుక్’లో పేరున్న వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందారు. వారిలో కొందరు రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధపడ్డారు.
కానీ కూటమి ప్రభుత్వం వారిపై ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకపోవడంతో మళ్ళీ అందరికీ ధైర్యం వచ్చింది. ఎంతగా అంటే, ప్రభుత్వం నిర్మించిన తారు రోడ్డును ట్రాక్టర్‌తో దున్నించేసే అంత!
ఈ ఘటన తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో జరిగింది. ఇటీవలే ప్రభుత్వం ‘పల్లెపండుగ’ కార్యక్రమంలో భాగంగా రూ.4.75 కోట్లతో సుమారు అనంత సముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లె వరకు నాలుగు కిలోమీటర్ల తారు రోడ్ నిర్మించింది. స్థానిక ప్రజల అభ్యర్ధన మేరకు డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ రోడ్డు మంజూరు చేసి నిర్మింపజేశారు.
అయితే సుబ్బారెడ్డి అనే ఓ స్థానిక వైసీపీ నాయకుడు , తన అనుచరులతో కలిసి ట్రాక్టర్‌తో రోడ్డును దున్నేసి పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై స్థానిక జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళారు.
ఆయన స్పందిస్తూ దీనిపై తక్షణం విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
వైసీపీ పై శ్రీ కిరణ్ రాయల్ ఆగ్రహం ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ గారు వేసిన రోడ్లు ధ్వంసం
రూ.4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం చేశారు
ప్రజల రాకపోకల కోసం నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం
కూటమి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే విధ్వంసానికి పాల్పడ్డారు
ప్రజలు వినియోగించే రహదారిని ధ్వంసం చేయడం హత్యకన్నా దారుణం
ఏకగ్రీవాలపై గతంలో జగన్ చేసిన ప్రకటనకు ఇప్పుడేం సమాధానం చెబుతారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై జగన్ చర్యలు తీసుకుంటారా…?
— JanaSena Party (@JanaSenaParty) October 19, 2026
The sixth week began on an extremely emotional note in the Bigg Boss house. Believing…
Bollywood directors praising Telugu cinema at the pre-release events of their films in the Telugu…