Telugu

గెలుపు పార్టీదైతే….ఓటమి ఎవరిది.?

తాజాగా ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలు దాని ఫలితాలపై వైసీపీ స్పందిస్తున్న తీరు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పార్టీ గెలిచిన స్థానాలలో వైసీపీ కి ప్రజాబలం తగ్గలేదు, కూటమి పై వైసీపీదే పైచేయి, ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రభుత్వ వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనాలు అంటూ ప్రచారం చేసుకుంటూ ఆ గెలుపు వైసీపీ పార్టీ ఖాతాలో వేస్తుంది.

ADVERTISEMENT

అదే పార్టీకి ఘోర ఓటమి ఎదురైన చోట మాత్రం అక్కడ అధికార పార్టీ రిగ్గింగ్ కి పాల్పడిందని, అధికారులను అడ్డుగా పెట్టుకుని దౌర్జన్యాలకు దిగిందని, కూటమి విజయం అప్రజాస్వామ్యం అంటూ పార్టీ ఓటమికి అధికార పార్టీని నిందిస్తుంది.

ఇలా ఎన్నికల ఫలితాల గెలుపోటముల మీద వైసీపీ ప్రదర్శిస్తున్న రెండు నాలుకల ధోరణి ఓటర్లను కూడా విస్మయానికి గురిచేస్తుంది. మున్సిపల్, మేయర్, జడ్పీటీసీ స్థానాలతో పోలిస్తే ఎంపీటీసీ స్థానాలలో వైసీపీ కాసంత మెరుగైన ఫలితాలు సాధించడంతో వైసీపీ కూటమి ప్రభుత్వం మీద రాజకీయంగా గెలుపు సాధించింది అంటూ వైసీపీ సోషల్ మీడియా సైన్యం అల్పసంతోషాన్ని ప్రదర్శిస్తున్నారు.

అల్లూరి జిల్లాలో మొత్తం 172 స్థానాలకు గాను వైసీపీ 89 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది, అలాగే అన్నమయ్య జిల్లాలో 69, పోలవరం జిల్లాలో 41, ఏలూరులో 107, విజయనగరంలో 101, శ్రీ సత్యసాయి లో 100, కర్నూలు లో 97 స్థానాల్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే ఇటు తిరుపతి రూరల్ జడ్పీటీసీ కూడా వైసీపీ ఖాతాలో చేరడంతో స్థానిక వైసీపీ నేత చెవిరెడ్డి ఇది వైసీపీ విజయం అంటూ అభివర్ణించారు.

ఇలా వైసీపీ ఆధిక్యం సాధించిన స్థానాల్లో, వైసీపీ జయకేతనం ఎగరేసిన సీట్లల్లో దానిని ప్రజా విజయమని, పార్టీ గెలుపు అని, కూటమి వ్యతిరేకత అంటూ ప్రచారం చేసుకుంటున్న వైసీపీ అదే వైసీపీ ఓటమి ఎదురైనా చోట కూడా ఆ ఫలితం వైసీపీ పట్ల ప్రజల అభిప్రాయమని, వైసీపీ నేతలను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఎందుకు భావించలేకపోతున్నారు.? గెలుపోటముల రెండిటిని ఒకే విధంగా చూడలేని పార్టీగా వైసీపీ ఎందుకు ప్రజల ముందు నిత్యం దోషిగా నిలబడుతుంది.?

2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమికి ఈవీఎంలను నిందించిన వైసీపీ ఇప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాల విషయంలో బ్యాలెట్ లో రిగ్గింగ్ జరిగిందంటూ ఓటమికి కారణాలు విశ్లేషించకుండా సాకులు వెతుకుతోంది. 2019 వైసీపీ ఘన విజయం ప్రజాస్వామ్యబద్ధమైతే 2024 కూటమి ప్రభంజనం అప్రజాస్వామ్యం ఎలా అవుతుంది.?

అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ గెలుపు ధర్మబద్ధమైతే నేడు జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ గెలుపు అధర్మం కిందకు ఎలా వస్తుంది.?

నాడు వైసీపీ పార్టీకి ఉన్నది ‘ప్రజాబలం’ అయితే నేడు కూటమి పార్టీలకు ఉన్నది ‘అధికార బలం’ అని ఎలా ప్రచారం చేస్తారు.? ఎన్నికలలో వైసీపీ గెలిస్తే ఆ గెలుపు పార్టీ ఖాతాలోకి వెళ్ళాలి, అలాగే ఆ విజయానికి సంబంధించిన క్రెడిట్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకోవాలి. అదే పార్టీ ఎన్నికలలో ఓడితే, ప్రజల నుంచి తిరస్కరణ ఎదుర్కొంటే దాని తాలూకా జవాబుదారీతనం పార్టీకి సంబంధం లేదా.? అందుకు పార్టీ అధినేతగా జగన్ బాధ్యత వహించరా.?

తాజాగా విడుదలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే…మొత్తం జడ్పీటీసీ స్థానాలకు గాను 77 ఏకగ్రీవాలు కాగా 582 స్థానాలకు ఎన్నికలు జరుగగా వైసీపీ కేవలం 76 స్థానాలలోనే విజయం సాధించగలిగింది. అలాగే ఎంపీటీసీ విషయానికొస్తే…9,821 స్థానాలకు గాను 2,051 ఏకగ్రీవాలు అయితే ఆ మిగిలిన 7,768 స్థానాలలో వైసీపీ 1,711 స్థానాలలో పరువు నిలబెట్టుకోగలిగింది.

అయితే ఇక్కడ వైసీపీ ఓడిపోయిన స్థానంలో కూటమి అప్రజాస్వామ్యంగా వ్యవహరించిందని, అధికారాన్ని రాజకీయ ఆయుధంగా ప్రయోగించిందని వాదిస్తున్న వైసీపీ, తానూ గెలిచిన స్థానాల్లో మాత్రం ప్రజాస్వామ్యం నెగ్గిందంటూ, ప్రజాబలం ముందు అధికార బలం తలవంచిందంటూ ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమర్ధనీయం.?

అంటే వైసీపీ గెలిచిన చోట ఆ పార్టీకి ప్రజాబలం ఉందంటే వైసీపీ ఓడిన ఆయా స్థానాలలో వైసీపీ కి ప్రజాబలం లేనట్టేనా.? కూటమి అధికార బలం అన్ని స్థానాలకు ఒకే రకంగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ ప్రయోగించిన అధికార బలాన్ని కూటమి వైసీపీ నెగ్గిన చోట కూడా ప్రయోగించవచ్చు, కానీ అక్కడ వైసీపీకే విజయం ఎందుకు వరించినట్టు.?

వైసీపీ ఓడిన చోట కూటమి అధికార బలం ఉన్నా వైసీపీకి ప్రజాబలం దక్కలేదు కాబట్టి…అంతేనా.? ఆ గోరంత గెలుపుకు వైసీపీ చేస్తున్న కొండంత ప్రచారం పార్టీని ప్రజల ముందు మరింత పలుచన చేస్తుందనే విషయాన్ని వైసీపీ ఇప్పటికైనా గ్రహించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas Took Worst Risk, Backfired Badly!

Prabhas is one of the biggest superstars in Indian cinema, with an extraordinary box-office following.…

5 minutes ago

Sequel Fever: Is Tollywood Running Out of Ideas?

A big-budget film ending with a sequel hint is no longer surprising in Tollywood. Even…

35 minutes ago