Telugu

వైసీపీ వ్యూహం గురించి టీడీపికి తెలుసో లేదో?

కొన్ని మాటలు కొందరి నోట వింటున్నప్పుడు అప్రయత్నంగానే చిర్నవ్వు వస్తుంది. మాజీ మంత్రి పేర్ని నాని నోట అటువంటి ఆణిముత్యాలు జాలువారాయి.

నేడు పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో అయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతున్నప్పుడు, జాలువారిన ఆణిముత్యాలు ముందుగా ఏరేసుకుందాం లేకుంటే తర్వాత అవి దొరకవు.

ADVERTISEMENT

“మనం ఓటర్లను డబ్బుతో కాదు.. ప్రేమతో కొనాలి. అప్పుడే ప్రతీ ఇంటిపై వైసీపీ జెండా రెపరెపలాడుతుంది. మనం మంచితనం, మానవత్వం ఉన్న అభ్యర్ధులనే నిలబెడదాం. వారి గుణగణాలు ఎలా ఉండాలంటే ప్రజలు మరొక అభ్యర్ధి గురించి ఆలోచించకూడదు.

రైతులు కన్నీరు పెడితే ప్రభుత్వాలు కూలిపోతాయి. రాష్ట్ర ప్రజలు తమ ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నామని బాధపడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కొవ్వులేదని ఈడీ, సీబీఐ తేల్చి చెప్పడం స్వామివారి మహత్యమే.

వైసీపీ నేతల మాటల్లో ఇలాంటి ఆణిముత్యాలు చాలా అరుదుగా దొర్లుతుంటాయి. కనుక ఆఫ్రికా దేశాలకు ఎగుమతైన రేషన్ బియ్యంలో రాళ్ళవంటి ఈ ఆణిముత్యాలను ఏరి భద్రపరుచుకోవాలి.

వైసీపీ ఎలాగూ మంచితనం, మానవత్వం, నీతి నిజాయితీగల వారితో కిక్కిరిసిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అలాంటి అభ్యర్ధులను నిలబెడితే ప్రజలు వేరే అభ్యర్ధిని చూస్తారా? చూడరు.

అందుకే చంద్రబాబు నాయుడు డబ్బు వెదజల్లి, అభ్యర్ధులను, ఓటర్లను భయపెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేస్తారని జగన్‌ ఎప్పుడో చెప్పేశారు. కనుక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితేనే వైసీపీ అభ్యర్ధులు గెలుస్తారని లేకుంటే లేదని కూడా అప్పుడే చెప్పారు.

అయితే మంచితనం, మానవత్వం ఉన్న అభ్యర్ధులని నిలబెట్టి ప్రేమతో స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలవాలనుకుంటున్న సంగతి చంద్రబాబు నాయుడుకి ఇంకా తెలిసుండదు.

ఇకపై చంద్రబాబు నాయుడు మతం పేరుతో వైసీపీని దెబ్బ తీయబోతున్నారంటూ, పేర్ని నాని మరో కొత్త విషయం కూడా కనిపెట్టి చెప్పారు. అయితే వైసీపీ హయంలో రాష్ట్రంలో ఇన్ని మతమార్పిడులు ఎందుకు జరిగాయి? కాపు సామాజిక వర్గం పేరుతో రాజకీయాలు చేసే వైసీపీలో కాపు నేతలు, హిందూ దేవాలయాలలో దొంగతనాలు, అపచారాలు జరుగుతుంటే, దేవతామూర్తులు ధ్వంసం అవుతుంటే ఎందుకు మాట్లాడలేదు?నాడు మతం పేరుతో రాజకీయాలు జరిగినందునే కదా?

కొస మెరుపు: రైతులు కన్నీళ్ళు పెడితే ప్రభుత్వాలు కూలిపోతాయని పేర్ని నాని ఇప్పటికైనా నిజం ఒప్పుకునందుకు చాలా సంతోషం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

People Will Be in The Paradise Hangover – Nani

Nani's upcoming film, The Paradise, is releasing on 24th September. Srikanth Odela is directing the…

13 minutes ago

Jailer 2: Can Nelson Pull Off a Miracle from SJ Suryah?

SJ Suryah has reached an unusual point in his career. After he sacrificed his career…

29 minutes ago