
1. ఆరోజు మధ్యాహ్నమే మంత్రి ఆదిమూలపు సురేష్ తన క్యాంప్ కార్యాలయం వద్ద నల్ల దుస్తులు ధరించి, అనుచరులతో కలిసి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకొంటామని హెచ్చరించారు. ఇదే విషయం టిడిపి నేతలు జిల్లా ఎస్పీకి ముందే తెలియజేసినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఆదిమూలపు సురేష్ అనుచరులు చంద్రబాబు నాయుడుపై రాళ్ళ దాడి చేయగలిగారు.
2. ఆరోజు మధ్యాహ్నం మంత్రి ఆదిమూలపు సురేష్, అనుచరులు నిరసనలు తెలియజేయడానికి రోడ్డు పక్కనే నిలబడి ఉన్నప్పుడు, ఓ పోలీస్ అధికారికి ఆయన సూచనలు ఇస్తుండటం, అందుకు ఆయన తలూపుతూ ‘ఇటువైపు నుంచే…’ అంటూ చెయ్యి చూపుతూ ఏదో చెప్పడం మీడియా రికార్డులలో స్పష్టంగా కనబడుతోంది. ప్రతిపక్ష నాయకులు ఎవరైనా నిరసనలు తెలియజేయడానికి బయలుదేరితే, పోలీసులు వారిని ముందుగానే గృహ నిర్బందం చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడుకి నిరసన తెలియజేయడానికి ‘అన్ని ఏర్పాట్లతో’ వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ని పోలీసులు కనీసం అడ్డుకొనే ప్రయత్నం చేయకపోగా, ఆయన నుంచే సూచనలు తీసుకొంటూ ‘ఈ కార్యక్రమాన్ని’ ఏవిదంగా చేయాలో చెపుతున్నారని టిడిపి వాదిస్తోంది.
3. మంత్రి ఆదిమూలపు సురేష్ పక్కనే నల్ల చొక్కా ధరించి, కళ్ళద్దాలు పెట్టుకొన్న ఓ యువకుడు ఉన్నాడు. స్థానిక టిడిపి నేతలకు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలందరినీ గుర్తుపట్టగలరు. కానీ ఆ యువకుడు మాత్రం స్థానిక వైసీపీ కార్యకర్త కాదని చెపుతున్నారు. బహుశః అతను ఐప్యాక్ సభ్యుడు కావచ్చని టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
4. మంత్రి ఆదిమూలపు సురేష్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు కనుక రోడ్డుపై చొక్కా విప్పేసి నిరసన తెలియజేస్తే, మీడియా ఫోకస్ బాగా వస్తుందని ఐప్యాక్ సూచించి ఉండవచ్చని టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నల్ల దుస్తులు ధరించి, నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలపాలని భావించిన మంత్రి ఆదిమూలపు సురేష్ అందుకే నడిరోడ్డుపై చొక్కా విప్పేసి హంగామా చేశారని టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత రెండు రోజులు మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు మీడియాలో మారుమ్రోగిపోవడాన్ని టిడిపి నేతలు గుర్తు చేస్తూ ఇది ఖచ్చితంగా ఐప్యాక్ వ్యూహంలో భాగమే అని వాదిస్తున్నారు.
5. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ టిడిపి నేతలపై దాడులు జరిగినా తిరిగి వారే తమపై దాడి చేశారంటూ వైసీపీ నేతలు నిందించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, టిడిపి నేతలపై కేసులు బనాయించడం పరిపాటిగా మారింది. కనుక చంద్రబాబు నాయుడుపై రాళ్ళ దాడి జరిగిన తర్వాత మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా అచ్చం అలాగే మాట్లాడటం గమనిస్తే ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిన దాడి అని టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…