
తాజాగా సోషల్ మీడియాలో మరో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆడియో ఒకటి హల్చల్ చేస్తుండడం గమర్హం. ఆ వీడియో లో శ్రీదేవి పార్టీలోని కొందరు ముఖ్య నేతల పై ఘాటైన విమర్శలు చేస్తుండడం ఆమెలోని అసహనాన్ని తెలియచేస్తుంది. అప్పిరెడ్డి, నందిగామ సురేష్ వంటి నేతల పై వాడు, వీడు, వెదవ, చిల్లరగాళ్ళు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు.
వైసీపీ పార్టీలో కేవలం ఎల్లక్షన్ల సమయంలో మాత్రమే బీసీ, ఎస్సి, ఎస్టీ నేతల అవసరాన్ని గుర్తిస్తారని.., ఆ తరువాత పెత్తనం అంత ఆ సామాజికవర్గం వారిదే.., మనకు ఆ సామాజికవర్గం వారు ఎప్పుడైనా విలువ ఇచ్చారా., ఎప్పుడు వారి కొఠరిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని ఉండవల్లి శ్రీదేవి తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. తనపై రాజకీయ కుట్రలు చేస్తే దేవుడే ఉన్నాడని అంత ఆయనే చూసుకుంటారని ఆవేదనను ఆమె వెళ్లబుచ్చారు.
ఇలా రోజుకో వైసీపీ నేతల ఆడియో _ వీడియో లీకులతో ఆ పార్టీ నేతలు వాటిని సమర్ధించలేక ఉక్కిరిబిక్కిరౌవుతున్నారు. లీకులతో సొంత పార్టీనేతల హస్తమే ఎక్కువగా ఉందనే ప్రచారం రాష్ట్రంలో ఎక్కువగా వినపడుతుంది.పార్టీ అధిష్టానమే వచ్చే ఎన్నికలలో ఆ నేతలను ఎన్నికల బరి నుండి తప్పించడానికే ఈ లీకుల అంశాన్ని తేర మీదకు తెచ్చిందా.? అన్న సందేహం కూడా కొంతమంది వైసీపీ నేతల మదిలో మెదులుతుందనే వాదన ఉంది.
ఏదిఏమైనప్పటికీ ఎప్పటిమాదిరిగానే ఈ ఆడియో లో ఉన్న వాయిస్ మార్ఫింగ్., డబ్బింగ్ ఆర్టిస్టుల చేత నా వాయిస్ ని తెలుగుదేశం పార్టీ మార్ఫింగ్ చేసింది, ఇందులో ఉన్నది నా వాయిస్ కాదు…అంటూ తమకు అలవాటైన బూతులతో తమకు పరిపాటిగా మారిన సామజిక వర్గాన్ని తిట్టిస్తూ దీనిని కూడా కులాల మధ్య గొడవలు గా చిత్రీకరిస్తారేమో అధికార పార్టీ వారు వేచి చూడాలి.
Venkatesh-Trivikram's Aadarsha Kutumbam AK47 is now expected to arrive in theatres on October 30, after…
Bigg Boss Telugu is one of the most entertaining reality shows in the world. The…