
ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రజలందరూ మూడు రాజధానులు కోరుకొంటున్నట్లయితే, వారి పాదయాత్ర తమ జిల్లాల మీదుగా సాగుతున్నప్పుడు రైతులకు సాధారంగా స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలిపేవారే కారు. ఎక్కడికక్కడ అడ్డుకొని ఉండేవారు. కానీ ప్రజలు ఆపని చేయకపోవడంతో మంత్రులే అందుకు సిద్దం అవుతున్నారు.
రైతులు హైకోర్టు అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తున్నారని తెలిసి ఉన్నప్పటికీ ఉత్తరాంద్ర జిల్లాలలో అడుగుపెట్టబోనీయమని ఆయా జిల్లాల మంత్రులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు… వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జెఏసీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దానిలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడిక్కడే రాజీనామా లేఖను ఇచ్చేశారు కూడా. కానీ స్పీకరుకి ఇవ్వాల్సిన రాజీనామా లేఖను జెఏసీ కన్వీనర్ లజపతిరాయ్కి ఇచ్చి రాజీనామా కూడా ఓ డ్రామా అని చెప్పకనే చెప్పారు.
ముందు ఆయన స్పీకర్ చేత తన రాజీనామాను ఆమోదింపజేసుకొని ఉంటే ఆయన మాటను ఎవరైనా నమ్మేవారు. కానీ అలా చేయకుండా దమ్ముంటే ఏపీ టిడిపి అధ్యక్షుడు, టెక్కలి టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అయితే వైసీపీ నేతలు ఓ విషయం మరిచిపోయినట్లున్నారు. మూడు రాజధానుల అంశం మీద ప్రజాభిప్రాయం కోరేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి సిద్దమైతే టిడిపిలో ఎమ్మెల్యేలందరూ రాజీనామాకు సిద్దమని ఎప్పుడో సవాల్ విసిరారు. కానీ దానికి స్పందించని వైసీపీ, ఇప్పుడు ఈ కొత్త డ్రామా ప్రారంభించింది.
తాము ప్రజల కోసమే రాజకీయాలు చేస్తాము తప్ప రాజకీయ ఎత్తుగడలు ఉండవని మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు వైసీపీ చేస్తున్నదేమిటి? ఏదో విదంగా టిడిపిని ఉచ్చులోకి లాగి దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది కదా?అయినా రాజధాని రైతులు అరసవిల్లికి పాదయాత్ర చేస్తుంటే వారిని చూసి వైసీపీ ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతోంది?అంటే తమ మూడు రాజధానుల ఆలోచన సరికాదని, దానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే భయంతోనే కదా?
పోనీ… ప్రజలు అవునన్నా కాదన్నా మేము మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉన్నామని ధైర్యంగా చెప్పి ఎన్నికలకు వెళితే తాడో పేడో తేలిపోతుంది కదా?ఈ రాజీనామా డ్రామాలు ఎందుకు? జెఏసీ మీటింగులు ఎందుకు?రాష్ట్ర ప్రజల మద్య చిచ్చు పెట్టడం ఎందుకు? అసలు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటే వాళ్ళని ఎవరు అడ్డుకొంటున్నారు?మరి ఏర్పాటు చేసేయవచ్చు కదా?ఎందుకు ఆగారు?
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…
Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…