
ప్రస్తుత పరిస్థితులలో వైసీపీ ని 11 వదల బొమ్మాలి నిన్ను వదలా అంటూ వెంటాడుతుందా అనిపిస్తుంది. ఇప్పటికే టీం 11 అంటూ మంత్రి లోకేష్ మీడియా ముందు వైసీపీని ఒకరేంజ్ లో ట్రోల్ చేస్తుంటే మరోపక్క 11 కి పర్యాయపదంగా వైసీపీ అంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ పై ట్రోల్స్ జరుగుతున్నాయి.
ఇక ఇప్పుడు పార్లమెంట్ లో జరిగిన ఒక ఘటనతో 11 కి వైసీపీ కి మధ్య బంధం ఎంత దృఢంగా ఉందో అర్ధమవుతుంది. పార్లమెంట్ లో రాజకీయ పార్టీలకు కేటాయించే గదులలో వైసీపీ కి 11 వ నెంబర్ గది వచ్చింది. దీనితో వైసీపీ 11 తో మరోసారి ట్రోల్ అవుతుంది.
2024 ఎన్నికలలో వై నాట్ 175 అంటూ వైసీపీ ముందుకెళితే ప్రజలు మాత్రం 2019 లో 151 తో ఇచ్చిన అధికారాన్ని 11 కి పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పిచ్చారు. దీనితో నాటి నుంచి నేటి వరకు వైసీపీ పై 11 అంటూ ట్రోల్స్ జరుగుతూనే ఉంటున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు జరిగే టైం నుంచి వారు సభలో ఉన్న సమయం వరకు అన్ని కూడా ఈ 11 కేంద్రంగానే జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ 11 వైసీపీ ని ఏపీ గల్లీల నుంచి ఢిల్లీ దాక వెంటాడిందనే చెప్పాలి. పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీ లకు కేటాయించిన గది నెంబర్ 11 కావడంతో ఆ పార్టీ నేతలందరూ కంగుతిని వెంటనే కట్టకట్టుకుని స్పీకర్ వద్దకు వెళ్లి తమకు ఈ 11 వద్దని అందుకు బదులుగా మరేదైనా నెంబర్ గదిని కేటాయించాలంటూ మొరపెట్టుకున్నారు.
అయితే ఇప్పటికే ఈ 11 వైసీపీ బ్రాండ్ ఇమేజ్ ని పాతాళానికి తెచ్చింది. ఇక రాబోయే రోజులలో కూడా వైసీపీ ఈ 11 నెంబర్ ను తమ పార్టీ గుర్తింపుగా కొనసాగిస్తే అందుకు ఇంటా బయటా భారీ ట్రోలింగ్ తప్పదని గ్రహించిన సదరు పార్టీ ఎంపీలు స్పీకర్ కు తమ గోడు విన్నవించుకున్నారు. దీనితో వారి బాధను అర్ధం చేసుకున్న స్పీకర్ వారికి 11 కి బదులుగా 12 వ నెంబర్ గదిని కేటాయించారు.
అయితే ఈ 11 తో వైసీపీ కి జరగాల్సిన నష్టం అయితే ఇప్పటికే జరిగిపోయింది. దేవుని స్క్రిప్ట్ ఇంత బలమైనదా.? వైసీపీ ని 11 ఈ రకంగా వెంటాడుతుందా.? టీం 11 కి 11 అంటూ సోషల్ మీడియాలో వైసీపీ పై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైపోయింది. ఇక ఎన్డీయే లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న టీడీపీ కి మొదటి అంతస్తులోని కీలకమైన 9 వ నెంబర్ గది దక్కింది.
Crazy Kalyanam is moving ahead of its theatrical release by arriving earlier than originally planned.…
There is a different side of Teja Sajja to be seen in The Traitors Telugu.…