
అంతవరకు ఈ విషయం తెలియని వైసీపీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ప్లీనరీలో పాల్గొన్నారు. ఆమె తన రాజీనామా ప్రకటించేసరికి చాలా మంది షాక్ అయ్యారు. అంతవరకు ఆనందకరంగా ఉన్న ప్లీనరీలో ఒక్కసారిగా గంభీరమైన వాతావరణం ఏర్పడింది. అమ్మవంటి విజయమ్మ పార్టీ విడిచిపెడుతున్నారనే విషయం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు.
ఆ తరువాత ప్లీనరీలో ఇతర అంశాలపై చర్చ జరిగింది. సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. కానీ విజయమ్మ రాజీనామా ప్రకటనతో అవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. అప్పటివరకు మీడియాలో ప్లీనరీ విశేషాల గురించే వార్తలు వచ్చాయి కానీ ఆ తరువాత విజయమ్మ రాజీనామానే హైలైట్ చేశాయి.
ఆమె పార్టీకి ఏవిదంగా సేవలు చేసింది… జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ చెదిరిపోకుండా ఏవిదంగా కాపాడుకొన్నారు.. అసలు విజయమ్మ ఎందుకు రాజీనామా చేశారు?ఆమె స్వయంగా చేశారా లేక జగన్ ఆమె చేత బలవంతంగా ఎందుకు రాజీనామా చేయించారా?విజయమ్మ, షర్మిల-జగన్‌ల మద్య విభేధాలు… కష్టకాలంలో అండగా నిలబడిన తల్లిని, చెల్లిని బయటకు సాగనంపడం… వంటి అంశాలపై మీడియాలో ప్రధానంగా వార్తలు, విశ్లేషణలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.
అసలు ఆమె చేత రాజీనామా చేయించాలనుకొంటే, ప్లీనరీలో కాకుండా వేరెప్పుడైనా చేయించి ఉంటే ఇంత చర్చ, ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఇలా చేస్తే ప్రతిపక్షాలు, మీడియా ఏవిదంగా రియాక్ట్ అవుతాయో జగన్మోహన్ రెడ్డికి, దేశముదురు వైసీపీ నేతలకు తెలియదనుకోలేము. కానీ విజయమ్మను బయటకు సాగనంపాలనే తొందరపాటుతో ప్లీనరీలో ఆమె చేత రాజీనామా ప్రకటింపజేశారు. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతగా సమర్ధించుకొన్నా జరగవలసిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా ప్లీనరీకి ఎంతో ఉత్సాహంగా వచ్చిన పార్టీ కార్యకర్తలు ఎంతో బాధపడ్డారు.
కనీసం తొలిరోజు ప్లీనరీ ముగిసే ముందు విజయమ్మ చేత రాజీనామా చేయించినా ఆ ప్రభావం కాస్త తక్కువగా ఉండేది కానీ ఉదయం ఆమె చేత రాజీనామా చేయించి మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు అందరూ కలిసి హాయిగా నవ్వుకొంటూ, కబుర్లు చెప్పుకొంటూ విందు భోజనాలు ఆరగించడం ప్రజలకు మరో తప్పుడు సంకేతం పంపినట్లయింది. విజయమ్మ రాజీనామా వారెవరికీ ఏమాత్రం బాధ కలిగించలేదనే భావన కలిగించింది. ఏది ఏమైనప్పటికీ ప్లీనరీతో ఏదో సాధిద్దామనుకొంటే మరేదో జరిగింది. కనీసం ఈరోజు ప్లీనరీలోనైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకొనే విదంగా వ్యవహరిస్తే వారికే మంచిది.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…