
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువగా వైసీపీ పార్టీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే వైసీపీ అధికారంలో ఉంటే ఒక రకమైన వివాదాలు సృష్టిస్తే ప్రతిపక్షంలో ఉంటే మరోరకమైన వివాదాలను తెరమీదకు తెస్తుంది.
నాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధాని తో మూడుముక్కలాట ఆడిన వైసీపీ చివరికి విశాఖ రాజధానిగా ప్రకటించి అందుకు గుర్తుగా రుషికొండ ప్యాలస్ నిర్మించింది. అయితే నేడు వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోవడంతో రాష్ట్ర రాజధాని విషయంలో విశాఖ నుంచి మావిగన్ కు దిగొచ్చారు జగన్.
అయితే ఈ మావిగన్ ప్రకటన కేంద్రంగా వైసీపీ కొన్నాళ్ళు రాష్ట్ర రాజధాని పై రాజకీయం చేసింది. మావిగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, రాజధానిగా మావిగన్ రెడీ టూ యూజ్ ప్రాంతమని, రాష్ట్ర రాజధానిగా మావిగన్ ప్రాంతాన్ని ప్రకటిస్తే కొన్ని కోట్ల ప్రజా ధనం ఆదా అవుతుందని ఇలా రాష్ట్ర రాజధాని కేంద్రంగా వైసీపీ రాజకీయం నడిపింది.
అయితే ఇక ఆ రాజకీయానికి ఎక్స్ పైరీ డేట్ ఉందా అన్నట్టుగా మావిగన్ వివాదానికి తాత్కాలిక బ్రేక్ వేస్తూ మరోకొత్త వివాదం కోసం వైసీపీ వెతుకులాట మొదలుపెట్టింది. ఇక తాజాగా సాయికృష్ణ అంశాన్ని భుజానికెత్తుకున్న వైసీపీ ఈ వివాదంతో కొన్ని రోజుల పాటు రాజకీయ కాలక్షేపం చేసేందుకు సిద్దమయ్యింది.
సాయికృష్ణ లాకప్ డెత్ కు కులం రంగు పూసి అందులో బాధితుడిగా కాపు సామాజికవర్గాన్ని ఉంచేందుకు వైసీపీ ఎంతగానో శ్రమిస్తోంది. ఇందుకోసం స్వయంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సాయికృష్ణ నేరాలకు కులం రంగు పూసి, ఆయన పై కేసులకు వయసు మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ వివాదానికి ఎక్స్ పైరీ డేట్ ఎపుడు అనేది ఆ జగన్నాథుడికే ఎరుక.
అలాగే గతంలో తిరుమల లడ్డు కల్తీ విషయంలో కూడా వైసీపీ ఆ దేవదేవుడిని న్యాయస్థానం మెట్టెలెక్కించడంతో పాటుగా చట్టసభలకు లాక్కొచ్చింది. వెంకన్న లడ్డు ప్రసాదం లో కల్తీ జరిగిందని, అసలు ల్డడు తయారీకి వాడిన పదార్ధాలలో నెయ్యి లేని లేదని నివేదికలో స్పష్టమయినప్పటికీ ఆ విషయాన్ని పక్కకు లాగుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదుగా అంటూ వైసీపీ వితండవాదన మొదలుపెటింది.
చివరకు వెంకన్న ఫోటోను శాసనమండలికి తెచ్చి చట్టసభలలో నిల్చోబెట్టింది. అయితే ఈ వివాదం మీద కొన్ని రోజుల పాటు మీడియాలో నానా హంగామా చేసిన వైసీపీ ఒక్కసారిగా సైలెంట్ అయిపొయింది. అయితే ఇలా వైసీపీ తానూ ఎత్తుకుంటున అంశాలను వివాదాలుగా మార్చుకుంటూ ఒక్కో వివాదం తో కొన్నాళ్ళు రాజకీయ కాలక్షేపం చేస్తూ ఇప్పటికే రెండేళ్లు గడిపేసింది.
ఇక రానున్న మూడేళ్ళ పాటు వైసీపీ ఇదే రకమైన రాజకీయంతో ముందుకెళితే రాష్ట్రంలో కుల రాజకీయాలు, హింసా రాజకీయాలు, మత రాజకీయాలు హద్దులు దాటే అవకాశం ఉంటుంది. రప్ప రప్ప అంటూ వైసీపీ చేస్తున్న హంగామా, జగన్ 2.0 అంటూ వైసీపీ ప్రదర్శిస్తున్న అత్యుత్సహం వై నాట్ 175 నినాదం మాదిరి సిద్ధమా అన్న జగన్ పిలుపు లెక్క చూడడానికి, చెప్పుకోవడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాలను వైసీపీ నేతలు ఇప్పటికి ఊహించలేకపొతున్నారు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…