వైసీపీ ‘నో’ షర్మిల వివాదానికి చెక్ పెట్టనుందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్న ల విడాకుల వార్త పవన్ అభిమానులను ఎంతలా బాధించిందో అంతలా భయపెట్టిందనే చెప్పాలి. గత కొన్నేళ్ళుగా వైసీపీ పవన్ వ్యక్తిగత జీవితం టార్గెట్ గా చేసిన రాజకీయం అంత ఇంతా కాదనే చెప్పాలి.

అయితే ఆ విమర్శలకు 2024 కూటమి విజయం, జనసేన 100% స్ట్రైక్ రేట్, పవన్ డిప్యూటీ సీఎం హోదా వైసీపీ నోళ్లకు కాస్త తాళం వేసిందనే చెప్పాలి. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మరోసారి పవన్ విడాకుల వార్త జనసైనికులను కలవరానికి గురిచేస్తుంది.

ADVERTISEMENT

అయితే పవన్, అన్న విడాకుల వార్త పవన్ అభిమానులకు ఎటువంటి షాక్ ఇచ్చిందో వైసీపీ తన పార్టీ శ్రేణులకు ఇచ్చిన సోషల్ మీడియా ప్రకటన కూడా జనసైనికులకు అంతకు మించిన షాక్ అనే చెప్పాలి. వైసీపీ శ్రేణులు ఎవరు రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాల మీద స్పందించవద్దని, వారి వ్యక్తిగత ప్రైవసీ కి గౌరవం ఇవ్వాలంటూ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

అయితే రాజకీయాల్లో పార్టీల నుంచి అటువంటి ప్రకటనలు ఆ పార్టీ అధినేత హుందాతనాన్ని పెంచుతుంది. వైసీపీ నుంచి వెలువడిన ఈ పోస్ట్ పై అటు ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

అయితే వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం వైఎస్ కుటుంబంలో రచ్చకెక్కిన అన్నా – చెల్లెళ్ళ వివాదానికి ముగింపు పలికే ప్రక్రియలో భాగం కానుందా అన్న చర్చ నడుస్తుంది. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నుంచి జగన్ – షర్మిల మధ్య రాజకీయ గ్యాప్ తో పాటుగా కుటుంబ వివాదాలు కూడా మీడియాకెక్కాయి.

విజయలక్ష్మి, జగన్, షర్మిల మధ్య అనేక వివాదాలు, విభేదాలు మీడియాలో వార్తలుగా, కోర్టుల్లో కేసుల రూపంలో ప్రజల ముందుకొస్తున్నాయి. అయితే ఆ వివాదాల కేంద్రంగా జగన్ ను రాజకీయంగా ఇరుకునపెట్టేందుకు వైసీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వివాదాల విషయంలో అటు వైసీపీ కానీ ఇటు జగన్ కానీ దూకుడుగా ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ కు మద్దతుగా వచ్చిన ఈ ప్రకటన అటు జగన్ కు కూడా తన ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా రాజకీయంగా కాస్త ఉపశమనం లభించే వ్యూహంలో భాగంగానే భావించాలా.? టీడీపీ శ్రేణులు కానీ, జనసైనికుకులు కానీ జగన్ ను ఇరుకున పెట్టెల షర్మిల వివాదాన్ని తెరమీదకు తెస్తే అప్పుడు వైసీపీ కుడా పవన్ విడాకుల అస్త్రాన్ని బయటకు తీసే అవకాశం ఉంటుంది.

మీరు వ్యక్తిగత వివాదాల జోలికి వస్తే మేము కూడా వ్యక్తిగత విషయాల టార్గెట్ గా ముందుకెళతాం అనే వాదనను వైసీపీ లేవనెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక నుంచి కూటమి పార్టీల నేతలు కూడా జగన్ – షర్మిల వివాదాల పై ఆచితూచి వ్యవహారించాల్సి ఉంటుందేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి వైసీపీ ‘నో’ షర్మిల వివాదానికి చెక్ పెట్టబోతోందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Far-Right Activists Disrupt Seattle Diwali Festival

Diwali celebrations in Seattle turned into chaos on November 7th. The Seattle Center Armory were…

1 minute ago

PK’s Marriage Is His Personal Matter: Ambati Rambabu

Former Andhra Pradesh minister and YSRCP leader Ambati Rambabu has declined to comment on Deputy…

20 minutes ago