
చంద్రబాబు పై జగన్ ప్రభుత్వం ఎంత కక్ష కట్టిందో తాజా పరిణామాలు చూస్తున్న ఎవ్వరికైనా యిట్టె అర్ధమవుతుంది.ముందు స్కిల్ డెవెలప్ మెంట్ లో బాబు 3 వేల కోట్ల అవినీతి చేసారంటూ ఆరోపణలు మొదలుపెట్టి ప్రస్తుతానికి 27 కోట్లకు పరిమితమయ్యారు. బాబు బెయిలు కోసం టీడీపీ ఎంత న్యాయపోరాటం చేసిందో అంతకంటే పదింతలు వైసీపీ బాబుకు బెయిలు రాకుండా ఉండడానికి ప్రయత్నించింది.
ఎట్టకేలకు టీడీపీ, వైసీపీ పై చెయ్యి సాధించింది.బాబుకి మధ్యంతర బెయిలు సాంక్షన్ చేశారు హైకోర్టు న్యాయమూర్తి. ముందుగా స్కిల్ స్కాం అన్నారు, తరువాత ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చారు, ఆ తరువాత ఫైబర్ నెట్ కు చేరుకున్నారు,అక్కడి నుండి అంగళ్ళు వెళ్లారు. ఇలా ఒకదాని తరువాత ఒకటి కేసులు వేసుకుంటూ బాబుని జైలుకి పరిమితం చెయ్యాలనే ఆదుర్దా వైసీపీ ప్రభుత్వంలో స్పష్టంగా కనపడుతుంది.
స్కిల్ కేసులో బెయిలు రావడానికి రెండు రోజుల ముందు దీనిలో బాబుకి బెయిలు వచ్చినా మరో కేసుతో మళ్ళీ జైలుకే పంపాలనే ఆలోచనతో అక్రమ మార్గాలలో మద్యం కంపెనీలకు చంద్రబాబు తన హయంలో అనుమతులిచ్చారు అంటూ మరో కేసుతో ఇంకో అడుగు ముందుకేశారు.కానీ వైసీపీ వేసిన పాచిక అక్కడ పారక పోవడంతో ఇప్పుడు మళ్ళీ ఇసుకను మోసుకొచ్చారు.ఇలా వైసీపీ అరాచకాలు నానాటికి శృతిమించుతున్నాయి అంటున్నారు టీడీపీ నేతలు.
టీడీపీ హయాంలో ఇసుక అక్రమాల పై APMDC ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో బాబుని A2 గా పేర్కొన్నారు. ఉచిత ఇసుక ముసుగులో చంద్రబాబు 10 వేల కోట్లు దోపిడీ చేసారంటూ బాబు పై మరో కేసు పెట్టారు ఏపీ సిఐడి అధికారులు.మొత్తానికి ఇక రాష్ట్రంలో ఇంకేం మిగలలేదా? అన్నట్టు వైసీపీ తీరు కనపడుతుంది. లోకేష్ అన్నటు వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం అంటే ఇదేనేమో అన్నటుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కేసులను మాజీ ముఖ్యమంత్రి పై మోపడం ఏపీలో నే కాదు దేశంలోనే ఇదే ప్రథమమేమో.
ఇలా కాకుండా చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులపై అక్రమ మార్గాలే అనుసరించారంటూ తన నవరత్నాల మాదిరి నవ కేసులతో ముందుకెళ్తే సరిపోతుందికదా? అంటూ వైసీపీ తీరుని ఎండగడుతున్నారు.నాన్న – పులి కథ మాదిరి ఇక్కడ దోచేశాడు, అక్కడ దోచేశాడు అంటూ పదేపదే చెపితే ఆ కథలో మాదిరే అవుతుందని వైకాపా నేతలు గ్రహించాలి.ఒక్కకేసు పెట్టి 50 రోజులు జైలులో ఉంచితే జగన్ సాధించింది ఏమిటో మొన్న రాజమండ్రి నుండి ఉండవల్లి వరకు జరిగిన చంద్రబాబు యాత్ర చూస్తే తెలుస్తుంది.
కానీ వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను కళ్లుండి చూడలేని వారీగా చెవులుండి వినలేని వారీగా నటిస్తుంటే మాత్రం ఇక దేవుని స్కిప్ట్ ఫాలో అవ్వాల్సిందే.ఇలా జగన్ ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అధికారం ఉందనే అండతో అధికారులతో చేయిస్తున్న ఈ చర్యలకు ప్రతిఫలం మాత్రం స్వయంగా అనుభవించాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…