వైసీపీ చేపల వేట ఫలించేనా?

ప్రస్తుతం సముద్రంలో చేపల వేటపై నిషేదం ఉంది. కానీ వైసీపీ నేతలు ఇప్పుడే చేపల వేటకు బయలుదేరారు. కానీ వారి వలలో ఒక్క చేప కూడా పడే అవకాశం కనిపించడం లేదు.

మత్స్యకార భరోసా పధకం కింద కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున నిధులు విడుదల చేయడం వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. సంక్షేమ పధకాలు అమలుచేయాలంటే ఒక్క జగన్‌ వల్లనే సాధ్యం మరెవరూ అమలుచేయలేరని, వారికి జగన్‌ అంత నిబద్దత కూడా ఉండదని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.

ADVERTISEMENT

వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి తన కోసం రుషికొండపై విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకున్న జగన్‌, రాష్ట్రంలో నిరుపేదలకు పింఛన్ ఇవ్వడానికి చేతులు రాలేదు. ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ 5 ఏళ్ళలో రూ.3,000 పింఛన్ ఉదయం 6 గంటలకే తలుపు తట్టి షిక్కటి చిర్నవ్వుతో అందించడమే చాలా గొప్ప విషయం అన్నట్లు చెప్పుకునేవారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి హడావుడీ చేయకుండానే పింఛన్ ఒకేసారి రూ.4,000కి పెంచి అందిస్తున్నారు.

జగన్‌ గొప్పగా చెప్పుకునే అనేక పధకాలకంటే సిఎం చంద్రబాబు నాయుడు ఈ మత్స్యకార భరోసా పధకంతో మరో రూ.5,000 ఎక్కువే ఇచ్చారు. కనుక వైసీపీ నేతలు జీర్ణించుకోవడం కష్టమే.

కనుక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టి 2014-19 లో సిఎం చంద్రబాబు నాయుడు రూ.4,000 చొప్పున కేవలం 33,000 మందికి మాత్రమే ఇస్తే, జగన్‌ హయాంలో 1.20 లక్షల మందికి ఏదాడికి రూ.10 వేలు చొప్పున ఇచ్చామని, రూ.10 లక్షల భీమా హామీ కూడా ఇచ్చామని గుర్తు చేశారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు భీమా హామీ అమలుచేయలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో చెల్లించకుండా ఎగ్గొట్టారని, మళ్ళీ 2028-29లో ఎన్నికల వంకతో ఎగ్గొడతారని సీదిరి అప్పలరాజు విమర్శించారు. కానీ తమ జగనన్న ఏడాదికి రూ.10,000 ఇస్తే, సిఎం చంద్రబాబు నాయుడు రూ.20,000 ఇస్తున్నారని చెప్పడానికి సీడిరికి నోరు రాలేదు.

అయినా మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ తన శాఖ, తన జిల్లా, నియోజకవర్గం గురించి మాట్లాడని సీదిరి అప్పలరాజు వంటి వైసీపీ నేతలందరూ, శాసనసభ ఎన్నికలలో ప్రజలు తనని ఎందుకు తిరస్కరించారో ఆత్మ విమర్శ కూడా చేసుకోకుండా, సిఎం చంద్రబాబు నాయుడు ఏదైనా మంచి పని చేస్తే కోడిగుడ్డుకి ఈకలు పీకేందుకు ఇలా పోటీ పడుతుంటారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

25 minutes ago

Is Rashmika Too Busy For Ranabaali? Vijay Explains

Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…

25 minutes ago