Telugu

ఎమ్మెల్సీ ఎన్నికలు: వైసీపీకి ఎప్పుడూ గండమే

రాష్ట్రంలో రెండు పట్టభద్ర. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. కేవలం 5-6 నెలలకే చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్‌ వాదిస్తుంటారు.

ADVERTISEMENT

కనుక విద్యావంతులు ఓటర్లుగా జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తన వాదనలు నిజమని నిరూపించుకునేందుకు జగన్‌కి మంచి అవకాశం లభించింది. కానీ ఓటమి భయంతో వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది.

ఈ ఎన్నికలు జరుగక ముందే వైసీపీకి అవమానకరంగా మారబోయే మరో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బి. తిరుమల నాయుడు పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది.

వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి, పదవికి రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ సీటు కూడా ఖాళీగా ఉంది.

కనుక ఈ 5 ఎమ్మెల్సీ సీట్లకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ : నోటిఫికేషన్‌: మార్చి 3; నామినేషన్స్ గడువు: మార్చి 10; పోలింగ్: మార్చి 20 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవి ఎమ్మెల్యేల కోటాలో జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక శాసనసభలో సంఖ్యాబలం ఆధారంగానే అభ్యర్ధులను బరిలో దింపాల్సి ఉంటుంది.

వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున ఒక్క అభ్యర్ధిని కూడా పోటీ చేయించలేదు. మొత్తం 5 సీట్లు కూటమికే లభిస్తాయి. కనుక కూటమి పార్టీలు ఎవరిని అభ్యర్ధులుగా ప్రకటిస్తే వారు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికైపోయిన్నట్లే!

వైసీపీకి తగినంత మంది ఎమ్మెల్యేలు లేరు కనుక ఈ ఎన్నికలలో పోటీ చేయలేకపోవచ్చు. కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా జగన్‌ మళ్ళీ ‘మేమే అధికారంలోకి వస్తాము.. మరో 25-30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తానని’ గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, కనీసం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేని దుస్థితికి వైసీపీ దిగజారడం అవమానమే కదా?
అయినా జగన్ రాష్ట్రంలో ఇష్టారా

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Reporting Live Review: An Absolute Disaster, Nothing Works

BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…

18 minutes ago

Nani Fine-Tuning The Paradise for OTT

The theatrical version of The Paradise may not be the final version audiences get to…

49 minutes ago