Telugu

వైసీపీ కి ఎందుకింత వెటకారం…ఎందుకింత నిర్లక్ష్యం..!

తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ట్రోలింగ్ కు ముందుగా ఆజ్యం పోసింది ఎవరు అని ఒక్కసారి వెనక్కి తిరిగి తమను తాము ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఇట్టే కళ్ళముందు సాక్ష్యాత్కరిస్తుంది. వెటకారంతో వెక్కిరింపులు చేసేది ఎవరు..? అటువంటి వారిని వెనకేసుకొచ్చి నిర్లక్ష్యం వహిస్తుంది ఎవరు..?

2014 నుంచి వైసీపీ సోషల్ మీడియా దారుణాలను ఒక్కసారి వెలిక్కి తీసి పరిశీలిస్తే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు తమ వ్యతిరేకుల మీద పెట్టిన పోస్టులు కానీ, వారి పై చేసిన ట్రోలింగ్ కానీ ఎంత నీచాతినీచమో అర్ధమవుతుంది.

ADVERTISEMENT

సాక్ష్యాత్తు వైస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వైస్ జగన్ సోదరి వైస్ షర్మిల పైన కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ ఏస్థాయికి చేరిందో తెలుసుకోవడానికి ఆమె చేసిన వ్యాఖ్యలే ఉదాహరణలు. వైస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఏకంగా వైసీపీ సోషల్ మీడియా సైన్యాన్ని కాలకేయ సైన్యంతో పోల్చారు అంటేనే పరిస్థితి ఎంత హద్దులు దాటింది అనేది స్పష్టమవుతుంది.

మొన్న జగనన్న కాలనిలో ఇంటి పట్టా పుచ్చుకున్నాను అంటూ సోషల్ మీడియాలో ఎంతో సంతోషంగా తన ఆనందాన్ని పంచుకున్న గీతాంజలి…తన పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ ను తట్టుకోలేక బలవన్మరణానికి సిద్దపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘాతుకానికి పాలపడ్డవారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ ఖచ్చితంగా శిక్షార్హులే. అందులో ఎటువంటి అనుమానాలకు తావుండకూడదు.

అయితే కేవలం తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే గీతాంజలి చావుని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఆ పార్టీ అధినేత నుండి ఆపార్టీ సోషల్ మీడియా కార్యకర్త వరకు సమాజం అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అటువంటి వారి పై వెంటనే చర్యలు తీసుకున్న వైసీపీ ప్రభుత్వం మరి సొంత పార్టీ నేతల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో చెప్పాలి.

తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తే తల్లినైనా చెల్లినేనా వదిలేది లేదు అంటూ వారి పుట్టుకుల దగ్గర నుంచి వివాహాల వరకు ఉన్న వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా కించపరుస్తూ వైసీపీ చేస్తున్న విధ్వంసాన్ని ఏమనాలి..? ఆ కీచక పర్వానికి శిక్షేక్కడ పడాలి..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యను ఉద్దేశించి వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో కీలక బాధ్యతలు వహించే వ్యక్తి పెట్టిన పోస్టు…ఆడవారి పైన వైసీపీ కి ఉన్న గౌరవాన్ని సూచిస్తుందా..? అటువంటి పోస్టుల వలన ఆ మహిళలు ఎంతగా క్షోభించి ఉంటారో..? ఆ క్షోభకు న్యాయం జరిగేదేప్పుడు..?

అలాగే ఎన్టీఆర్ మనవరాలు.. బాలకృష్ణ కుమార్తె..చంద్రబాబు కోడలు..లోకేష్ భార్య…అలాగే వారి రాజకీయ అవసరాల కోసం అడ్డుపెట్టుకునే జూ. ఎన్టీఆర్ సోదరి అయిన నారా బ్రహ్మణి మీద వైసీపీ సోషల్ మీడియా చేసిన దారుణాలు ఇన్నా అన్నా..? సమాజంలో ఇంతటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉండి…సినీరంగంలో అగ్రస్థానంలో ఉంటున్న కుటుంబంలోని ఆడవారినే సోషల్ మీడియా వేదికగా బజారుకు లాగుతున్న ఈ వైసీపీ… సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలు గురించి ప్రశ్నించడం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా’ ఉంది.

అలాగే టీడీపీ, జనసేన పార్టీల తరుపున బలంగా తమ గొంతు వినిపిస్తున్న మహిళా నేతల పైన వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దారుణాలు సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే సమాజానికి అంత మంచిదనే చెప్పాలి. సాక్ష్యాత్తు తాడేపల్లి జగన్ నివాసానికి కూతవేటు దూరంలో తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పవన్ సాయం కోరిన మహిళా వాలంటీర్ కుటుంబం పై వైసీపీ చేసిన దాష్టికాలకు స్థానిక ప్రజలే ప్రత్యక్షసాక్ష్యాలుగా మిగిలారు.

అలాగే తన బిడ్డ చావుకి న్యాయం చేయండి అంటూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన సుగాలి ప్రీతి తల్లి పై వైసీపీ కార్యకర్తలు చేసిన నీచమైన విమర్శలకు బాధ్యులెవరు…? తప్పు ఎవరు చేసిన తప్పే..తప్పు ఎక్కడ జరిగినా తప్పే..దాన్ని ఎవ్వరు ప్రోత్సహించిన తప్పే. సమాజం పై ఏమాత్రం బాధ్యత లేకుండా తమ ప్రత్యర్థుల నోటికి కళ్లెం వేయాలి అనే దురుద్దేశంతో సామజిక మాధ్యమాలలో ప్రతిపక్ష నాయకుల మీద వారి కుటుంబాలం మీద ఆర్జీవీ, శ్రీరెడ్డి, పంచ్ ప్రభాకర్, బోరుగడ్డ అనిల్ వంటి వారితో జగన్ చేపిస్తుంది ఏమిటి..? ప్రవచనాలా..? లేక బూతు పురాణాలా..?

అలాగే కొడాలి నాని, పేర్నినాని , అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, రోజా, అనిల్ కుమార్ యాదవ్ వంటి నాయకులతో వైసీపీ చేస్తుంది బూతు రాజకీయం కాదా..? ‘పొద్దున్న లేస్తే వెటకారం…రాత్రి గడిస్తే వెక్కిరింపు’ తప్ప ఈ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఈ నాయకులు చేసిన మంచేమిటో మచ్చుకైనా కనపడదు…చిటికెడైన వినపడదు. ఇటువంటి నాయకులను ప్రోత్సహిస్తూ నాయకులు గా తయారు చేస్తున్న తప్పు సమాజానిదా..? లేక పార్టీల అధినేతలదా..? సమాజం పైన చెడు ప్రభావం చూపే ఇటువంటి వారి పైన నిర్లక్ష్యం వహిస్తుంది ఎవరు..?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Will the CBI and ED Question Jagan?

The CBI and ED are tightening their investigations into several high-profile cases linked to Andhra…

18 minutes ago

Jailer 2 Review: Promising Start, Loses Steam

BOTTOM LINE Promising Start, Loses Steam RATING 2.5/5 Story, Screenplay, Director: Nelson Dilip Kumar Cast:…

21 minutes ago