Telugu

ఎన్నికలు కదా… జగన్ కు ‘టెస్లా’ గుర్తొచ్చింది..!

2019 అధికారం చేపట్టిన వెంటనే కూల్చివేతలే లక్ష్యంగా, అరాచకమే అజెండాగా సాగిన పాలనలో… “పెట్టుబడులు” అన్న పదానికి ఆస్కారం లేకుండా జరిగిన వైనం తెలియనిది కాదు. కొత్త పెట్టుబడులు దేవుడెరుగు, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను కూడా రాష్ట్రం వీడి వెళ్లిపోయేలా విజయవంతంగా తన పాలనను నిరవధికంగా సాగించారు.

తిరుపతి వేదికగా ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ వంటి పరిశ్రమలు కూడా తమ తదుపరి పెట్టుబడులను తెలంగాణాలో స్థాపించారే తప్ప, ఏపీలోకి కొత్తగా వచ్చిన ఏదైనా కొత్త పరిశ్రమ పేరు చెప్పాలంటే ఏపీ మంత్రి “కోడి గుడ్డు మీద ఈకలు” లెక్కపెట్టాల్సిందే. ఇలా పెట్టుబడులను గాలికొదిలేసి సాగిన పాలన చరమాంకం చేరేటప్పటికి, ‘టెస్లా’ వంటి పెద్ద పెద్ద కంపెనీ పేర్లు బయటకు వస్తున్నాయి.

ADVERTISEMENT

టెస్లాను ఏపీకి ఆహ్వానించినట్లుగా రెండు ఈ మెయిల్స్ పంపామని, కియా ప్లాంట్ సమీపంలో భూమి ఉందని, త్వరలోనే ఏపీకి టెస్లా వస్తుందని ‘జగన్ అండ్ కో’ మీడియా వర్గాలు ఊదరగొడుతున్నాయి. అయితే ఇదే టెస్లా ప్రతినిధులతో 2017లో లోకేష్ స్వయంగా భేటీ అయ్యి, ఏపీకి ఆహ్వానించిన వైనం రాజకీయ విజ్ఞులకు తెలియనిది కాదు.

జగన్ వేసిన ఎన్నికల గుళికలలో ఈ ‘టెస్లా’ కూడా ఒకటని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీ బస్సులు తిరగడానికే వీలు కానటువంటి ఏపీ రోడ్లపై టెస్లా కార్లు తిరిగే ఎలా ఉంటుందో చెప్పాలంటే… గత నాలుగేళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న మేమ్స్ చూస్తే జగన్ పాలన గురించి ఇట్టే అర్ధం అయిపోతుంది.

అనంతపురం జిల్లాలో చంద్రబాబు తీసుకువచ్చిన కియా వంటి ప్రతిష్టాత్మకైన సంస్థల అధికారులు ఏపీ విడిచి వెళ్లిపోతామని మీడియా ముఖంగా హెచ్చరికలు చేస్తే తప్ప నాడు 2019లో ‘జగన్ అండ్ కో’ వెనక్కి తగ్గలేదు. అంతటి చిత్తశుద్ధి గల వైసీపీ ప్రభుత్వం నేడో రేపో దిగిపోనుండగా వేసిన ఈ ‘టెస్లా’ గోలికి ప్రజలు పడిపోతారని భావిస్తున్నారా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47 Confusion Turns Double Trouble for Venkatesh?

Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…

1 hour ago

H-4 EAD Update: USCIS Removes Automatic Extension

The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…

2 hours ago