Telugu

వైసీపీ పవన్ ను ‘కాపు’ కాస్తుందా.?

కుల సమీకరణలకు, సామాజికవర్గాల రాజకీయాలకు పుట్టినిల్లుగా చెప్పబడే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహం తెరపైకి వచ్చింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విపక్ష వైసీపీ అనుసరిస్తున్న తాజా వైఖరిని నిశితంగా పరిశీలిస్తే…ఆ పార్టీ పవన్ ను ‘కాపు’ కాసే ప్రయత్నం చేస్తుందా.? అన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది.

నిన్నటి వరకు దాడి…నేటి మౌనం:

ADVERTISEMENT

వైసీపీ ఆవిర్భావం నుంచి ఈటీవీస్లీ కాలం వరకు పవన్ పై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఏ ఒక్క చిన్న అంశం దొరికిన దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకుని పవన్ ను లక్ష్యంగా చేసుకునే వారు. పవన్ బాబు నాయకత్వానికి మద్దతు పలికితే ప్యాకేజీ స్టార్ అంటూ నిందలు మోపారు.

టీడీపీ తో రాజకీయ పొత్తు పెట్టుకుంటే పవన్ టీడీపీ పల్లకి మోసేందుకే ఉన్నాడని ప్రచారం చేసారు. పవన్ వైసీపీ ని రాజకీయంగా విమర్శిస్తే, వైసీపీ మాత్రం పవన్ ‘మూడు పెళ్లిళ్ల’ అంశాన్ని తెరమీదకు తెచ్చి ఆయన పై వ్యక్తిగత దాడి చేసేది.

అలాగే సీఎం బాబు పై తన పార్టీ నేతలు బూతులతో రెచ్చిపోయినా, ఒక రౌడీ షీటర్ ను పోలీసులు లాకప్ డెత్ చేసినా అందుకు కూడా అందుకూ పవన్ న్నే కార్నర్ చేస్తూ వైసీపీ కాపు సామాజికవర్గాన్ని రెచ్చకొట్టే ప్రయత్నం చేసింది. ఇలా పవన్ ను వ్యక్తిగతంగా, రాజకీయంగా, సామాజికవర్గం పరంగా టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు సడెన్ గా పవన్ పై సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంది.

హఠాత్తుగా మరీనా వైసీపీ వైఖరి:

గత కొన్ని రోజులుగా వైసీపీ తన రాజకీయ విమర్శల నుంచి జనసేన ను పవన్ ను పక్కన పెట్టింది. తాజాగా పవన్ మూడో విడాకుల వార్త పై కూడా వైసీపీ ‘నో’ పాలసీ విధానాన్ని ఎంచుకుని అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఉన్నట్టుండి వైసీపీ లో ఇంత మార్పు వెనుక ఉన్న వ్యూహమేమిటి అనేదాని పై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

వైసీపీ క్షేత్ర స్థాయి వాస్తవాలు గ్రహించిందా.?

గత 2024 ఎన్నికల ఫలితాలు, నాటి స్థానిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకున్న వైసీపీ ముఖ్యంగా కాపు సామాజికవర్గం ప్రధాన పాత్ర పోషించే గోదావరి జిలాల్లో వైసీపీ పట్ల ప్రజా తీర్పుని చూసిన పార్టీ నేతలు ఈ నిర్ణయానికి వచ్చారా.?

పవన్ టార్గెట్ గా ముందుకెళితే భవిష్యత్ లో వైసీపీ కాపు సామాజికవర్గానికి దూరమవుతుంది అనే క్షేత్ర స్థాయి వాస్తవాన్ని వైసీపీ ఇప్పటికి గ్రహించిందా.? రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఉండదు అనే కఠిన నిజాన్ని వైసీపీ అంగీకరిస్తుందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కవిత: “బీఆర్ఎస్ అవినీతిలో నాకు భాగం లేదు!”

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాగిస్తున్న రాజకీయ ప్రయాణంలో నేడు మరో కీలక అంకం తెరపైకి…

18 minutes ago

AOT: Allu Arjun & Dulquer On One Stage

The team of Aakasamlo Oka Tara, starring Dulquer Salmaan, is preparing for the film's release…

18 minutes ago