Telugu

వాళ్ళు ఉగ్రవాదులైతే…వీళ్ళు వైసీపీ వాదులా.?

తాజాగా భారత్ లోని పెహల్గామ్ పై జరిగిన ఉగ్రదాడి కి గాను యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఉగ్రమూక మారణ హోమానికి 26 మంది అమాయకులు బలయ్యారు. అయితే ఈ ఉగ్రవాదుల వెనుకున్న ఆ దుష్ట శక్తి ఎవరన్నది ప్రపంచానికి తెలిసినప్పటికీ ఇప్పటి ఆ దేశం పై మమకారాన్ని చాటుతున్నారు కొంతమంది భారతీయుల ముసుగులలో ఉండే అసాంఘిక వాదులు.

అయితే మన దేశంలో ఉంటూ మన దేశానికి హాని కలిగించే శత్రు దేశం పై ప్రేమ చాటుతున్న ఈ ఉన్మాదులను కూడా తీవ్రవాదులుగానే పరిగణించాలి, ఉగ్రమూకలుగానే గుర్తించాలి. అయితే ఇదే తీరుగా ఇప్పుడు ఏపీలో ఉంటూ, ఏపీలో రాజకీయం చేస్తూ, ఏపీ ప్రజల ఓట్లతో నాయకులుగా గుర్తింపు పొంది ఇప్పుడు తమ రాజకీయ అవసరాల కోసం అదే ఏపీ వినాశాన్ని కోరుకుంటున్న వైసీపీ ని ఏమనాలి.?

ADVERTISEMENT

దేశంలో ఉంటూ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్న వారు ఉగ్రవాదులైతే…రాష్ట్రంలో ఉంటూ రాష్ట్ర విధ్వంసాన్ని కాంక్షిస్తున్న వీరు వైసీపీ వాదులా.? 5 కోట్ల ఆంధ్రుల గుర్తింపు, గౌరవం, భవిష్యత్తు ఏపీ రాజధాని అమరావతి, దాని పై వైసీపీ చేస్తున్న నీచ రాజకీయం చూస్తుంటే ఇంతకన్నా దిగజారరు అన్న ప్రతిసారి అంతకు మించి అన్నట్టుగా వైసీపీ చేస్తున్న రాజకీయం ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తుందనే చెప్పాలి.

నిన్న వెలగపూడిలో జరిగిన కార్యక్రమం పై కూడా వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టేసింది. 500 కోట్లు ఖర్చు పెట్టి వెలగపూడిలో అమరావతి పునః ప్రారంభ పనులు కాకుండా నమో, బాబు భజన కార్యక్రమం జరిగింది, రాష్ట్రానికి నయాపైసా ప్రయోజనం లేని కార్యక్రమం పై టీడీపీ బాహుబలి రేంజ్ ప్రచారాలు చేస్తుందంటూ వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది.

మే 2 రాష్ట్రానికి ఎంతో కీలకమైన రోజు, వైసీపీ గ్రహణంతో రాజధానికి పట్టిన చీకటికి వెలుగులు వచ్చిన రోజు, నిన్న ఒక్క రోజే సుమారు 49 వేల కోట్ల విలువైన 74 పనులకు మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. దానికి తోడు మరో 5 వేల కోట్లతో 9 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, 3 వేల కోట్లతో 8 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులు కలిపి మొత్తం దాదాపు 57 వేల కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు జరిగాయి.

ఇవన్నీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏపీలో నిర్మించబోయే నిర్మాణాలే. అంటే ఇన్ని కోట్ల నిధులతో నిర్మించబోయే 94 ప్రాజెక్టులకు వైసీపీ దృష్టిలో విలువలేదా.? వీటి వల్ల రాష్ట్రానికి నయాపైసా లాభం లేదా.? ఇవన్నీ కూడా భవిష్యత్ లో రాష్ట్రానికి ఆదాయ మార్గాలుగా మారవా.? వాటి వలన ఏపీలో అభివృద్ధి జరగదా.? ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరకవా.?

కేవలం జగన్ మాదిరి ప్రతి ఆరు మాసాలకోసారి పరదాల చాటున బయటకొచ్చి బటన్ నొక్కితేనే పాలన చేసినట్టా.? ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడం వైసీపీ దృష్టిలో నేరమా.? అసలు ఈ సభ ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులెంటి.? ప్రోజెక్టులేంటి.? అవి ఏ ఏ ప్రాంతాలలో నిర్మిస్తారు.?

ఆ నిర్మాణాల వలన అభివృద్ధికి చేరువయ్యే నగరాలేమిటో.? ఆ ప్రోజెక్టుల నిర్మాణాలతో ఏ ప్రాంతం వారైనా ఇబ్బందులు పడుతున్నారా.? కేంద్రం అందిస్తున్న నిధులను, ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయగలుగుతుందా.? ఇలాంటి చర్చలు చేయాల్సిన నీలి మీడియా వాటిని పక్కన పెట్టి,

సభలో లోకేష్ కు ప్రాధాన్యం ఇచ్చారు, పవన్ కు అవమానం జరిగింది, మోడీ, బాబు ఒకరికొకరు భజన చేసుకున్నారు అంటూ కోడిగుడ్డు మీద ఈకలు తీసే విశ్లేషణలు చేస్తుంది. ఇటువంటి విశ్లేషణలు, అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి కానీ వైసీపీ శ్రేణులు కానీ రాష్ట్ర క్షేమాన్ని కాంక్షిస్తున్నారా.? లేక అవసరం లేని రాజకీయం చేస్తూ రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వారి ఆరాటం.. ప్రజాస్వామ్యం కోసమా. ఓటు బ్యాంకు కోసమా?

ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్‌ కలిసి నిర్వహిస్తున్నయా?…

2 minutes ago

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

30 minutes ago