Telugu

వైసీపీ టార్గెట్ ఈనాడు… కానీ వేధింపులు మార్గదర్శికి

గత ఎన్నికలలో వైసీపీ భారీ మెజార్టీతో మెజార్టీతో ఏపీలో అధికారంలో వచ్చింది. నిజానికి వైసీపీకి ఇదో గొప్ప అవకాశమనే చెప్పాలి. అయితే వైసీపీ ఈ అవకాశాన్ని వేరే విదంగా ఉపయోగించుకొంటోంది. అధికారంలోకి రాగానే ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తూ, వారిని భయబ్రాంతులను చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ADVERTISEMENT

అయితే ఎప్పటికీ వైసీపీయే అధికారంలో ఉండాలనుకొంటే, అందుకు ప్రత్యర్ధులను దెబ్బ తీయక్కరలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లాగ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు. కానీ రాష్ట్రాభివృద్ధి చాలా కష్టమైన పని కనుక ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది.

ఓ వైపు తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీస్తూ, మరోవైపు అప్పులు తెచ్చి సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచడం మొదలుపెట్టింది. వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, అసమర్దతను ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా ప్రశ్నిస్తుండటంతో దానినీ శత్రువుల జాబితాలో చేర్చేసింది.

రామోజీ గ్రూప్ ఛైర్మన్‌ రామోజీరావు అధ్వర్యంలో ఈనాడు మీడియా కూడా వాటిలో ఒకటి. అయితే నేరుగా ఈనాడు మీడియాను ఢీకొంటే యావత్ మీడియా సంస్థలు వచ్చి దానికి బాసటగా నిలుస్తాయి. పైగా వైసీపీ ప్రభుత్వం మీడియాను వేధిస్తోందనే చెడ్డపేరు కూడా వస్తుంది. కనుక రామోజీరావుకే చెందిన మార్గదర్శిని వేదిస్తోంది.

మార్గదర్శి సంస్థ అక్రమంగా ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు సేకరిస్తోందని, వాటికి సరిగ్గా రికార్డ్స్ నిర్వహించడం లేదనేది వైసీపీ ప్రభుత్వ ఆరోపణ. అయితే మార్గదర్శి ఖాతాదారులు ఎవరూ దానిపై ఎన్నడూ ఫిర్యాదులు చేయలేదు. ఎందుకంటే వారికి వడ్డీతో సహా సొమ్ము సకాలంలో తిరిగి ఇచ్చేస్తోంది కనుక. ఆ నమ్మకమే నేటికీ మార్గదర్శిని నిలబెడుతోంది. ఆ కారణంగానే ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కూడా మార్గదర్శి విస్తరించగలిగింది.

ఈ విషయం వైసీపీ ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు. కానీ ఈనాడు మీడియాను కట్టడి చేయాలంటే, మార్గదర్శిపై నిరంతరం ఒత్తిడి పెంచుతూనే ఉండాలని భావిస్తోంది. అందుకే ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను కూడా వేదిస్తూనే ఉంది. అంతటితో ఆగకుండా సమాజంలో వారి గౌరవప్రతిష్టలు దెబ్బ తీసేందుకు సైకలాజికల్ వార్ కూడా చేస్తోంది. రామోజీరావు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతుంటే ఆయన ఫోటోలు, వీడియోలను విడుదలచేయడం కూడా అటువంటిదే అని చెప్పవచ్చు.

దీనిపై పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ, “మన ఇంట్లో ఆడవాళ్ళను ఎవరైనా కన్నెత్తి చూస్తే వారిని చంపేయాలనుకోవడం, అదే మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను ఈవిదంగా వేధిస్తుండటం చాలా దారుణం” అని అన్నారు. అయితే ఇలాంటి దౌర్జన్యాలకు భయపడి మీడియా, సమాజంలో మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రశ్నించడం మానుకొంటే, తమను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని వైసీపీ నేతల అరాచకాలు ఇంకా ఇంకా పెరిగిపోతాయని అన్నారు.

కనుక ఇలాంటప్పుడే ధైర్యంగా నిలబడి పోరాడాలని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈనాడు మీడియా అదే చేస్తోంది. అందుకే మార్గదర్శికి ఈ వేధింపులు తప్పడం లేదని అన్నారు. అయినా భరిస్తూ వైసీపీ అరాచకాలను ఈనాడు మీడియా నిలదీసి ప్రశ్నిస్తూనే ఉందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

వైసీపీ ప్రభుత్వం దానిపై ఎల్లో మీడియా అని ముద్ర వేసినంతమాత్రన్న తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేదని గ్రహించాలని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఖైరతాబాద్ లో కవిత వెనుకున్న ఆ రాజకీయ బలం ఎవరు.?

ఖైరతాబాద్ ఉపఎన్నికలలో తెలంగాణ రక్షణ సేన తరుపున ఒక బలమైన అభ్యర్థిని నిలబెడతాం అంటూ కవిత చాల కాన్ఫిడెంట్ గా…

22 seconds ago

Kappi Squad Review: Average but Watchable Urban Comedy

BOTTOM LINE Average but Watchable Urban Comedy PLATFORM JioHotstar RUNTIME 1 Hour 73 Mins (4…

6 minutes ago