
వైసీపీ గెలుపు కోసం బిఆర్ఎస్, బిఆర్ఎస్ అధికారం కోసం వైసీపీ రిటర్న్ గిఫ్టుల రూపంలో తెరచాటు సాయాలు చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.
అయితే ఈ రెండు పార్టీలకు, ఇద్దరు పార్టీల అధినేతలకు ఉమ్మడి శత్రువైన టీడీపీ పతనం కోసం బాబు పరాజయం కోసం ఈ రెండు పార్టీల అధినేతలే కాదు రెండు పార్టీల సోషల్ మీడియాలు కూడా తమవంతుగా ఒకరికోసం ఒకరు సహకరించుకుంటాయి.
2019 ఏపీ ఎన్నికలలో బాబుకి కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి బదులుగా జగన్ అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే హైద్రాబాద్ లో ఉన్న ఏపీ ఉమ్మడి ఆస్తులను జగన్ ఒకే ఒక్క సంతకంతో తెలంగాణకు దారాదత్తం చేసారు. ఇలా ఒకరికోసం ఒకరు అన్నట్టుగా సాగుతున్న వైసీపీ – బిఆర్ఎస్ రాజకీయ బంధం నానాటికి మరింత బలంగా మారుతూ వస్తుంది.
గతంలో తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కి వ్యతిరేకంగా అన్న మీద పంతం తో వైఎస్ షర్మిల తెలంగాణలో టి.వైసీపీ పార్టీని స్థాపించి జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ ప్రకటనలు చేసారు. అలాగే చివరికి టి. వైసీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టారు.
ఆ సమయంలో తెలంగాణలో ఉన్న షర్మిల తన ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యిందంటూ ఆరోపించారు. అయితే జగన్ కు రాజకీయ సాయం చేసేందుకే బిఆర్ఎస్ షర్మిల టార్గెట్ గా ట్యాపింగ్ కు పాల్పడి ఉండవచ్చు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఇక ఇప్పుడు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ రెండు కూడా అధికారానికి దూరమయ్యి వచ్చేది మేమే అనే ఊహాలోకంలో విహరిస్తున్నారు. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కేసీఆర్, కేటీఆర్ ని కాదనుకుని కవిత తెరాస పేరుతో కొత్త రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో నాడు జగన్ కోసం షర్మిలను టార్గెట్ చేసిన బిఆర్ఎస్ కోసం నేడు వైసీపీ కవితను టార్గెట్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంది. బిఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా తండ్రి కేసీఆర్ ని మొదలుకుని అన్న కేటీఆర్ వరకు ఎవరిని ఉపేక్షించకుండా కవిత సాగుతున్న రాజకీయ యుద్ధంలో కేసీఆర్, కేటీఆర్ మొదలుకుని బిఆర్ఎస్ శ్రేణులంతా మౌన పాత్రలోనే ఉంటున్నారు.
కానీ తెలంగాణ రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని వైసీపీ మాత్రం బిఆర్ఎస్ కోసం కవిత ను టార్గెట్ చేయడానికి సిద్డమయ్యింది. ఇదంతా గమనిస్తే నాటి కేసీఆర్ సాయానికి నేడు జగన్ ఋణం తీర్చుకుంటున్నారా.? లేదా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న సాయానికి వైసీపీ భవిష్యత్ లో బిఆర్ఎస్ సాయం కోరనుందా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…