టిడిపికి అభ్యర్ధులు లేరన్న నోటితోనే నిసిగ్గుగా చెప్పుకొంటున్నారే!

వైసీపి అధినేత గత మూడు నెలలుగా తాడేపల్లి ప్యాలస్‌లో ఎన్నో కసరత్తులు చేసి ఏడు జాబితాలు విడుదల చేయగలిగారు. ఈసారి కూడా వైసీపి ఒంటరిగానే పోటీ చేస్తోంది. కనుక వేరే పార్టీలతో సీట్ల సర్దుబాట్లు ఉండవు. జగన్మోహన్‌ రెడ్డి తనకు నచ్చినవారికి టికెట్స్ ఇచ్చుకోవచ్చు.

ADVERTISEMENT

మూడు నెలలు కసరత్తులు చేసి ఏడు జాబితాలలో కలిపి శాసనసభ 69 మందిని, లోక్‌సభకు 18 మంది ఇన్‌చార్జిలను మాత్రమే ఖరారు చేశారు. కానీ దాదాపు అందరినీ ఖరారు చేశామని చెపుతూనే వారిలో ఇంకా ఒకటీ ఆరా మార్పులు ఉంటాయని జగన్‌ స్వయంగా నిన్న చెప్పారు.

వైసీపి వరుసపెట్టి జాబితాలు ప్రకటిస్తుంటే, బీజేపీతో పొత్తు వ్యవహారం తేలకపోవడంతో టిడిపి, జనసేనలకు చేతులు కట్టేసిన్నట్లయింది. దీంతో వాటికి అభ్యర్ధులు లేరని వైసీపి నేతలు, వారి ఆత్మసాక్షి గోలగొల చేశాయి. ఈసారి టిడిపి, జనసేనలు ఓడిపోబోతున్నాయి కనుక టిడిపి తరపున పోటీ చేయడానికి అభ్యర్ధులు ముందుకు రావడం లేదని చెప్పుకొంటూ పైశాచికానందం అనుభవించాయి. టిడిపి, జనసేనల పొత్తుతో తీవ్ర ఆందోళనతో ఉన్న వైసీపి నేతలకి ఇటువంటి చిన్న చిన్న ఆనందాలే మిగులుతున్నాయి పాపం!

చంద్రబాబు నాయుడు స్వయంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడివచ్చిన తర్వాత కూడా బీజేపీ నుంచి స్పందన లేకపోవడంతో మొన్న ఆదివారం రెండు పార్టీలు కలిసి 118 శాసనసభ స్థానాలకు తమతమ జాబితాలను ప్రకటించేశాయి. టిడిపి 94 మంది అభ్యర్ధులను ప్రకటించగా, జనసేనకు లభించిన 24 స్థానాలలో 4 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి, మిగిలిన స్థానాలకు అభ్యర్డులను ఖరారు చేసుకుంటోంది.

టిడిపి తొలి జాబితాలో టికెట్లు దక్కనివారిలో గొల్లపల్లి సూర్యారావు వంటి ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపిలో చేరుతున్నారు. ఇప్పుడు వైసీపి మనసాక్షి మీడియా వారిని చూపిస్తూ టిడిపిలో చాలా మందికి అన్యాయం జరిగిపోయిందంటూ కధనాలు ప్రసారం చేస్తోంది.

అయితే ఈ హడావుడిలో కొన్ని రోజుల క్రితమే టిడిపి తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులే లేరంటూ ఎద్దేవా చేసిన విషయాన్ని మరిచిపోయింది. టిడిపికి అభ్యర్ధులే లేకపోతే వైసీపి వైపు ఎవరు చూస్తున్నారు?ఎందుకు చూస్తున్నారు?

వైసీపిలో పోటీ చేయమంటే సీనియర్ నేతలు భయపడి తమ కుమారులకి టికెట్లు ఇప్పించుకొని, వారిచేత రాజకీయ ఆరంగ్రేటం చేయించుకుని, తాము ఓటమి అవమానం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అదే… టిడిపిలో ప్రతీ ఒక్క నియోజకవర్గంలో కనీసం ఇద్దరు ముగ్గురు అభ్యర్ధులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. దొరకనివారిలో కొందరు దిక్కులు చూస్తుండటం చాలా కామన్. కనుక టిడిపికి అభ్యర్ధుల కరువు లేదని అర్దమవుతోంది. కానీ అప్పుడు ఉందని చెప్పి ఇప్పుడు లేదని వైసీపి మనసాక్షి చెపుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Daily Hearing At CBI Court, But Can Jagan Stay Out?

It has been more than dedicate since the CBI and the enforcement directorate have failed,…

1 minute ago

వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ఈడీ స్పీడ్‌!

“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…

6 minutes ago