
గుంతలు పడిన రోడ్లనే పూడ్చలేకపోతున్న తమ ప్రభుత్వం విశాఖలో రాజధాని ఏర్పాటు చేయలేదని వారు ఎప్పుడో గ్రహించారు. కానీ ఈ పేరుతో ఉత్తరాంద్ర ప్రజలను రెచ్చగొట్టి టిడిపికి దూరం చేసి తమవైపుకి వచ్చేలా చేసుకోవాలని వైసీపీ ఆరాటపడుతున్నట్లు అర్దమవుతోంది. అదీ గాక రాజధాని రైతులు విశాఖలో అడుగుపెట్టే సమయానికి వారికి ప్రజల చేత చీత్కరింపజేయాలనే దురుదేశ్యం కూడా కనబడుతోంది. వైసీపీ నేతలు ముందు రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి వాటితో మొదటికే మోసం వస్తుందని గ్రహించగానే మళ్ళీ ఆ ప్రస్తావన చేయకుండా ఇప్పుడు జేయేసీ పేరుతో ఈ నెల 15వ తేదీన విశాఖ నగరంలో ర్యాలీలు, గర్జనలు అంటూ హడావుడి చేయడానికి సిద్దం అవుతున్నారు. జేయేసీ ర్యాలీకి వైసీపీ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రులు చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే దానిలో ఉన్నది వైసీపీ నేతలు, కార్యకర్తలే. వారిని నడిపిస్తున్నది మంత్రులు ఎమ్మెల్యేలే.
నిజానికి వైసీపీ ప్రభుత్వానికి విశాఖను రాజధాని చేయాలనే చిత్తశుద్ధి లేకపోవడం వలననే మూడున్నరేళ్ళు గడిచిపోయాయని చెప్పవచ్చు. వైసీపీకి చేసే పనిలో ఎప్పుడూ చిత్తశుద్ధి ఉండదు అది విశాఖ రాజధాని అయినా పోలవరం ప్రాజెక్టు అయినా… చివరికి రోడ్ల మీడియా గుంతలు పూడ్చడమైన దేనిలోనూ చిత్తశుద్ధి ఉండదు కానీ ప్రతీ పని, నిర్ణయంలో మరేదో ప్రయోజనం ఆశిస్తుంటుంది. విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంద్రలో సుమారు 40 వేల ఎకరాలు వైసీపీ నేతలు చేజిక్కించుకొన్నారని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోకతప్పదు. చేసేపనిలో చిత్తశుద్ధి లేని కారణంగానే రాష్ట్రంలో ఏ పని పూర్తికావడం లేదు. ప్రజలు కళ్ళారా చూస్తూనే ఉన్నారు కదా!
Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…
కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…