
A political news image featuring YSRCP leaders connected to the latest developments in Vizianagaram district, following Baddukonda Appalanaidu’s suspension and Chinna Srinu’s exit from the party.
రాజకీయ పార్టీలలో నాయకులు వారితో పాటు అనుచరులు పార్టీలు మారడం సర్వసాధారణం. అయితే అప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుంది? ఈ ప్రభావం ఆ పార్టీపై ఏ మేరకు ఉంటుంది? అనేదే కీలకం.
విజయనగరం జిల్లా వైసీపీకి బొత్స సత్యనారాయణ పెద్ద దిక్కుగా ఉంటే, ఆయన మేనల్లుడు చిన్న శ్రీను జిల్లాలో పార్టీకి మూల స్థంభంలా ఉండేవారు. అలాంటి స్థంభం ఇప్పుడు లేదు. కనుక ఆ భారం కూడా బొత్స సత్యనారాయణపైనే పడింది.
అప్పుడు ఆయన ఇంతకాలం తన వెంటే ఉన్న చిన్న శ్రీను అనుచరులు చేజారిపోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కనుక పార్టీ అధిష్టానం కూడా ఆయనకు సహకరించాలి.
కానీ నెల్లిమర్ల నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుని ఆ పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పిర్యాదులు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ప్రకటించింది. కానీ ఆయన చిన్న శ్రీనుకు బావ కనుక మొదట పదవిలో నుంచి తర్వాత పార్టీ నుంచి తొలగించినట్లు అర్థమవుతూనే ఉంది.
నెల్లిమర్ల వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరేందుకు అయనే కారణమని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఓ పక్క జిల్లాలో కీలకమైన చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాలలో వైసీపీ ఖాళీ అయిపోతుంటే, మిగిలిన వారిని కాపాడుకునే బదులు, వైసీపీ అధిష్టానం వారిని కూడా బయటకు సాగనంపుతూ పార్టీని పూర్తిగా ఖాళీ చేసుకొంటుండటం, అదీ… స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుంది కదా?
ఇప్పుడు జిల్లాలో కొత్త బ్యాచ్ స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీని గెలిపించుకోగలదా?గెలిపించుకుంటే ఇక బొత్స సత్యనారాయణకు తిరుగు ఉండదు. కానీ గెలిపించుకోలేక పోతే?ఎవరిని నిందించాలి?చిన్న శ్రీనునా? బొత్స సత్యనారాయణనా? లేక పార్టీ అధిష్టాన్నాన? లేక సిఎం చంద్రబాబు నాయుడునా?
Mahesh Babu’s Rudhra in Varanasi is shaping up to be less about the superstar image…
Sai Pallavi is known for being selective with her films, but her upcoming lineup is…