బీఆర్ఎస్‌-వైసీపీల సరికొత్త వ్యూహం ఇదేనా?

బీఆర్ఎస్‌, వైసీపీల మధ్య ప్రత్యక్షంగా సంబంధాలు లేవు కానీ కేసీఆర్‌, కేటీఆర్‌లతో జగన్‌కు మంచి అనుబంధం ఉంది. అధిష్టానం స్థాయిలో అనుబంధం ఉంది కనుక రెండు పార్టీలు, వాటి మీడియాలు పరస్పరం లబ్ధి కలిగేలా వ్యవహరిస్తుంటాయి.

ఈ కారణంగానే బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఎల్లప్పుడూ తమ ఉమ్మడి రాజకీయ శత్రువైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మాత్రమే టార్గెట్ చేసుకుంటారు తప్ప ఏనాడూ జగన్‌ జోలికి వెళ్ళరు.

ADVERTISEMENT

తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య నీళ్ళ పేరుతో జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరులో మాజీ మంత్రి హరీష్‌ రావు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు.

హరీష్‌ రావు ఏమన్నారంటే, “నాడు కేంద్ర మంత్రి ఎదుట జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి ‘బిడ్డా నువ్వు రాయలసీమ ప్రాజెక్టు ఆపుతావా లేదా? లేకుంటే నేను ఆలంపూర్ వద్ద బ్యారేజ్ కడతా… నీళ్ళు గుంజుతా.. అని మొహం మీదనే కాలర్ పట్టుకొని చెప్పినట్లు కేసీఆర్‌ చెప్పారు,” అని అన్నారు.

జగన్‌ కాలర్ పట్టుకొని కేసీఆర్‌ అడిగారన్నట్లు హరీష్‌ రావు చెప్పడం, మాజీ మంత్రి పేర్ని నానికి రోషం కలిగించింది. ఆయన వెంటనే స్పందిస్తూ, “హరీష్ రావు మావ కేసీఆర్‌ని తిట్టలేడు. చంద్రబాబు నాయుడుకి కేసీఆర్‌ అంటే భయం. కనుక ఆయన కూడా తిట్టడు. అందువల్ల వైసీపీ నేతలను కెలికితే వాళ్ళే కేసీఆర్‌ని తిడతారని, చూసి ఆనందిద్దామని హరీష్‌ ఆశ పడ్డారు.

మాకు హరీష్‌ రావు కుట్రల సంగతి తెలుసు గనుక అనవసరంగా ఆ పెద్దాయన (కేసీఆర్‌)ని తిట్టడం దేనికని ఊరుకున్నాం. కానీ అల్లుడు గిల్లుడు చూస్తూ కేసీఆర్‌ ఊరుకుంటే, అప్పుడు తప్పకుండా హరీష్‌ రావు కోరిక తీర్చేస్తాం. కేసీఆర్‌ దుమ్ము దులిపేస్తాం,” అని పేర్ని నాని హెచ్చరించారు.

వైసీపీ-బీఆర్ఎస్‌ రెండు పార్టీల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనే సంగతి అటు హరీష్‌, ఇటు పేర్ని ఇద్దరికీ బాగా తెలుసు. కానీ శత్రువుల్లా కత్తులు దూసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఆలోచింపజేస్తుంది.

ఏ విధంగా అంటే, బీఆర్ఎస్‌ పార్టీ ఆంధ్రా పాలకులను బూచిగా చూపిస్తూ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ రాజకీయంగా పైచేయి సాధించాలని ప్రయత్నిస్తుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడుకి, టీడీపీ నేతలకు బాగా తెలుసు కనుకనే వారికి ఆ అవకాశం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతున్నారు.

ఇదే ముక్కని పేర్ని నాని మరోలా చెప్పారు. అంతేకాదు.. ఈ పనికి హరీష్‌ రావు తమని ఎంచుకున్నారని, ‘కేసీఆర్‌ని చంద్రబాబు నాయుడు తిట్టరు కనుక మేము తిడతాం,’ అని చాలా స్పష్టంగా చెప్పారు కూడా. అప్పుడు బీఆర్ఎస్‌ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం మొదలుపెడితే ఇక్కడ ఆయనకు ప్రజల సానుభూతి, మద్దతు లభిస్తుంది.

కనుక ఒకవేళ బీఆర్ఎస్‌-వైసీపీల మధ్య ఇలాంటి యుద్ధం మొదలైతే, అది పరస్పరం రాజకీయ మైలేజ్, లబ్ధి కలిగించుకునేందుకు అమలు చేస్తున్న సరికొత్త వ్యూహంలో భాగంగానే భావించాల్సి ఉంటుంది.

Share
Published by

Recent Posts

Vrushakarma Raises the Bar, Now It’s Nithiin’s Turn

Nithiin, who is in need of a decent hit to make a comeback, is pinning…

28 minutes ago

Tirumala Gets 121 Kg Gold Donation Worth Rs 206 Crore

Chennai-based industrialist Vardhman Jain donated 121 kg of gold ornaments to Lord Venkateswara at Tirumala…

58 minutes ago