విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. దాని హిందీ రీమేక్, కబీర్ సింగ్ హిందీలో బ్లాక్ బస్టర్ కావడంతో అర్జున్ రెడ్డితో పాటు విజయ్ దేవరకొండ కూడా పెద్ద బ్రాండ్ అయిపోయాడు. దీనితో బాలీవుడ్ మీడియాలో విజయ్ తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు బాలీవుడ్ నుండి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందంట.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. దానిని తెలుగు, తమిళ, హిందీ భాషలలో నిర్మించడానికి సన్నద్ధం అవుతున్నారట. దీని కోసం విజయ్ కు 48 కోట్లు ఆఫర్ చేశారని వినికిడి. ఒకవేళ ఇదే నిజమైతే ఇది సెన్సషనల్ ఆఫర్ అనే చెప్పుకోవాలి.
విజయ్ ప్రస్తుతం తన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం నాడు విడుదలకు సిద్ధం అవుతుంది. అది అలా ఉండగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా ఒప్పుకున్నాడు విజయ్. ఆ సినిమా జనవరిలోనే సెట్స్ మీదకు వెళ్తుంది.
అది కాక మొన్న ఈ మధ్యే మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఒక సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఇవన్నీ కాకుండా మధ్యలో ఆగిపోయిన ఒక ద్విభాషా చిత్రం కూడా ఉంది. దానిని కూడా పూర్తి చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని సినిమాల మధ్య ఈ సినిమా విజయ్ ఎప్పుడు చేస్తాడో మరి.





